`మా` ఎన్నిక‌లు.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసిన మంచు విష్ణు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు అక్టోబర్ 10న జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇప్ప‌టికే పోటీలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మ‌రియు ఆయ‌న ప్యాన‌ల్ స‌భ్యులు నామినేషన్ వేశారు.

అయితే ఈ రోజు మా అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Here Is The Manchu Vishnu's Panel for MAA Elections - Manchu Vishnu

అనంత‌రం విష్ణుతో పాటు ఆయన ప్యానల్‌ సభ్యులు ఎన్నికల అధికారి కృష్ణ‌మోహ‌న్ కు నామినేష‌న్ ప‌త్రాలు అందించారు. కాగా, ఈ సారి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం చాలా మంది పోటీ ప‌డుతుండ‌గా.. ప్ర‌ధాన పోటీ మాత్రం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య నెల‌కొంది. మ‌రి వీరిలో ఎవ‌ర్ని విజ‌యం వ‌రిస్తుందో చూడాలి.