త్వరలో టీచర్ పోస్ట్ లను భర్తీ చేయనున్న సీ.ఎం..?

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా పోటీ కూడా యువత మధ్య ఎక్కువగానే నడుస్తుంది. ఇలాంటి టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను విడుదల చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో ఆయా జిల్లాల కమిటీ చైర్మన్లు ఏర్పాటు చేస్తున్నారట. ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఆ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కు కాల్ చేయవచ్చని తెలుపుతు వచ్చింది. అయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం టీచర్ పోస్టులు త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వచ్చిన వార్త కూడా మనకు తెలిసిందే.

అయితే నిరుద్యోగులు మాత్రం ఇది కేవలం ఎలక్షన్ల డ్రామా అని భావిస్తున్నారు. అయితే ఎలక్షన్ ముందు ఇలాంటివి వదలడం ప్రతి ఒక్క పార్టీకి కామన్ అవుతోంది. దీంతో ఎన్నో లక్షలు పోసి ఖర్చుపెట్టి చదువుకున్న నిరుద్యోగులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. వారు పేరు పొందడం కోసం ఇలాంటివి చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, ఆయా నియోజక వర్గాల వ్యక్తులు తెలియజేస్తున్నారు.

అయితే ఏది ఏమైనా త్వరలోనే ఉద్యోగాల జాతర రాబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కూడా పలు సందర్భాలలో తెలియజేశాడు. ఇందులో ముఖ్యంగా పోలీసు పోస్టులు కూడా దాదాపుగా 15,000 పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇది కేవలం ఎన్నికల ప్రభావమో.. లేదంటే నిరుద్యోగిని నిర్మూలించేందుకు విడుదల చేయబోతున్నారో అని తెలుసుకోవాలంటే మనం కొద్ది రోజులు ఆగాల్సిందే.