నాగార్జున తన తండ్రి తో చేసిన అతి పెద్ద తప్పు అదేనట.?

అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీకి మూలస్థంభం లాంటివారు. అలాంటి ఆయన కొడుకు అక్కినేని నాగార్జున గురించి చెప్పనవసరమే లేదు. ఈ ఏజ్ లో కూడా అమ్మాయిల గుండెల్ని కొల్లగొడుతున్న రాక్ స్టార్ హీరో.. ఇకపోతే నాగార్జున తన తండ్రి నాగేశ్వర రావు తో కలిసి నాగార్జున కొన్ని సినిమాలను తీశాడు. అందులో కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు లాంటి సినిమాలు.

అంతేకాకుండా వీరిద్దరు కలిసి మల్టీ స్టారర్ గా నటించాలని కంకణం కట్టుకున్నారట.అలాగే కొన్ని సినిమాలలో మల్టీ స్టారర్ లుగా కలసి నటించారు. కానీ ఆ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ కథ చెయ్యొద్దు అని కొంతమంది పెద్దలు చెప్పారట. అప్పటికీ వారి మాటలు పట్టించుకోకుండా ఆ సినిమా తీశారట . కానీ అది ఫ్లాప్ అయ్యింది.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కలిసి చేసిన తప్పు ఇదే అనిన్ కొందరు సీనియర్ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఏ.ఎన్.ఆర్, నాగార్జున లు కలిసి కోదండరామిరెడ్డి తో చేసిన సినిమా ఇద్దరూ ఇద్దరే అనే చిత్రంలో నటించారు.

మంచి సక్సెస్ ఫుల్ హీరోలు అలాగే మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో న్యాయమూర్తి కొడుకు
చిన్నప్పుడే తప్పిపోయి, పెద్ద రౌడీ గా మారుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన తండ్రి తన కొడుకు ని ఎలా దారిలోకి పెట్టాడు అనేది ఈ సినిమా కథ.

ఈ పాయింట్ ముఖ్యమైన విషయంగా ఉన్నా, ఈ సినిమాలో నాగార్జున నెగిటివ్ పాత్రను పోషించాడు.. ఆ సినిమాలో నాగార్జున తన తండ్రికి ఎదురుతిరిగే కొడుకుగా కనిపించడమే కొద్దిమంది అభిమానులకు నచ్చలేదు. కానీ సినిమా పెద్ద హిట్ కాలేదు ఫ్లాప్ అయ్యింది.

“ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా ” అనే సాంగ్ ను ప్రజలను అలరించింది. ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన రాజ్ కోటి కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పవచ్చు.