ఆ హీరో కి ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్…?

సినీ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకసారి ఏదో అనుకుంటే ఏదో అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఒక పెద్ద హీరో పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక ఆయన నటించిన సినిమాలలో ఆడుతూ పాడుతూ చేస్తూ ఉండేవారు. అంతే కాకుండా ఆయన సినిమాలు స్టార్ హీరోతో సమానంగా వసూళ్లను రాబట్టేవి.అంతేకాకుండా ఈయన ఒక నిర్మాత కూడా.

ఇది ఈ మధ్య కాలంలో ఈయన ఎక్కువగా మా సభ్యులలో ఒక వర్గానికి ఫోన్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఇక అంతే కాకుండా ఈ హీరోకి ఒక చెడు అలవాటు ఉంది అదేమిటంటే. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా, స్పీకర్ ఆన్ చేస్తూ ఉంటాడు. చుట్టు పక్కల ఉండే వాళ్లు అవతల వాళ్ళు మాట్లాడే మాటలు వింటే తనకు ఎంత గౌరవిమిస్తారో వారికి తెలియడం కోసం అతను అలా చేస్తూ ఉంటాడట.

ఇక ఈ మధ్య కాలంలోనే ఒక సీనియర్ ఆర్టిస్టుకి ఫోన్ చేయడం వల్ల, సంభాషణ మధ్యలో ఆమెను తనకు సపోర్ట్ చేయమని అడిగాడు. దాంతో ఆమె మొహమాటం కొద్దీ ఓకే చెప్పిందట. కానీ ఆయన ఫోన్ కట్ చేసిన తర్వాత, మళ్ళీ తిరిగి ఆమె కు ఫోన్ చేసి, అత్యుత్సాహంతో.. నోటి నుంచి ఒక మాట జారవిడిచారు అంట. దాంతో ఆమె చాలా కోపంగా.. నా జోలికి వస్తే మామూలుగా ఉండదు.. మీ ఇంట్లో మీరు గొప్ప.. అయితే నాకేంటి అని ఓ రేంజులో క్లాస్ పీకిందట.

ఈ ఫోన్ సంభాషణ దాదాపుగా పది గంటల వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. ఎదా విధంగా స్పీకర్ ఆన్ చేసిన ఆయన పరువు మొత్తం గంగలో కలిసి నట్టు అయింది. నిజానికి ఆయనకు ఫోను చేసింది ఎవరో కాదు మా సభ్యులలో పోటీ చేస్తున్న ఒక కీలకమైన అభ్యర్థికి. కానీ ఇంతకీ వారి పేరు బయట పెట్టలేదు.కానీ వీరిద్దరిపై ఇప్పుడు చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి.