`పాగల్` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంకా ఎంత వ‌సూల్ చేయాలంటే?

టాలీవుడ్ యంగ్ & ట్యాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్‌ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ , సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, లక్కీ మీడియా బ్యాన‌ర్ల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఆగ‌స్టు 14న థియేట‌ర్‌లో విడుద‌లై.. మిక్స్ట్ టాక్ తెచ్చుకున్నా మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది.

కానీ, రెండో రోజు మాత్రం బాక్సాపీస్ వ‌ద్ద డ‌ల్ అవ్వ‌గా.. రెండు రోజుల్లో దాదాపు రూ. 2.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ వికెండ్ క‌లెక్ష‌న్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటిని ప‌రిశీలిస్తే..

నైజాం-1.02 కోట్లు
సీడెడ్- 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.44 కోట్లు
ఈస్ట్- 0.13 కోట్లు
వెస్ట్- 0.09 కోట్లు
గుంటూరు- 0.17 కోట్లు
కృష్ణా- 0.11 కోట్లు
నెల్లూరు- 0.07 కోట్లు
————————————
ఏపీ + తెలంగాణ: 2.41 కోట్లు
————————————

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.23 కోట్లు

పాగ్ వరల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌- 2.64 కోట్లు

అయితే పాగల్ చిత్రానికి రూ.6.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి రూ.6.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.64 కోట్ల షేర్ ను రాబట్ట‌గా.. ఇంకా రూ.3.9 కోట్లను వ‌సూల్ చేయాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఆ టార్గెట్‌ను రీచ్ అవ్వ‌డం కాస్త క‌ష్ట‌మే అని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.