`పుష్ప‌`రాజ్‌కు షాక్ మీద షాక్‌..ఈసారి ఏం లీకైందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే మ‌న పుష్ప‌రాజ్ కు లీకుల బెడ‌ద కార‌ణంగా ప్ర‌స్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుద‌ల‌కు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర యూనిట్ అల‌ర్ట్ అయ్యే లోపే పుష్ష‌లోంచి ఓ కీల‌క‌మైన ఫైట్ సీక్వెన్స్ కూడా లీకైంది. దాంతో సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే అస్సలు ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ పుష్ప నుంచి మ‌రో లీక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాలోని మ‌రో పాట లీకైంది. వ‌ల్లీ..వ‌ల్లీ.. అంటూ ర‌ష్మిక‌పై సాగే పాట ఇది. మెలోడీ బీట్ తో సాగుతుంది. ఈ పాట చీత్ర‌క‌ర‌ణ‌ స‌మ‌యంలో ఎవ‌రో సెల్ ఫోన్ లో రికార్డు చేసి బ‌య‌ట‌కు వ‌దిలారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మ‌రి పుష్ప యూనిట్ ఇప్పుడు ఏం చేయ‌బోతోందో చూడాలి. కాగా, పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నారు. ఇప్ప‌టికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న మొద‌టి భాగం క్రిస్ట్మ‌స్‌ కానుక‌గా విడుద‌ల కానుంది.