గిన్నిస్ రికార్డ్: అతి తక్కువ సమయంలోనే 2 లీటర్ల కూల్ డ్రింక్ ఉఫ్..!

కూల్ డ్రింక్స్ తాగడం అంటే అందరికీ ఇష్టమే. ఈ మధ్య కాలంలో చల్లని పానీయాలు తాగడం చాలా మంది అలవాటు చేసుకున్నారు. ఈ కూల్ డ్రింక్స్ తాగడం అనేది రాను రాను ఓ వ్యసనంలా తయారవుతోంది. చాలా మంది పిల్లలు చిన్నతనం నుంచి కూల్ డ్రింక్స్ కు ఎక్కువగా అలవాటు పడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. కూల్ డ్రింక్స్ లోని పదార్థాలు మనుషులను స్థూలకాయులుగా చేస్తున్నప్పటికీ చాలా మంది వాటినే ఎక్కువగా తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అమెరికాలో కూడా ఓ వ్యక్తి కూల్ డ్రింక్స్ తాగడాన్ని బాగా అలవాటు చేసుకున్నాడు. ఆయనకు కూల్ డ్రింక్స్ అంటే పంచ ప్రాణాలు. ఆ అలవాటే ఇప్పుడు ఆయన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది. న్యూయార్క్ కు చెందిన ఆయన పేరు ఎరిక్ బూక‌ర్. చిన్నతనం నుంచి ఆయనకు కూల్ డ్రింక్స్ తాగడం అంటే చాలా ఇష్టం. అలా అలవాటు చేసుకున్న ఆ పద్దతి ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ నెలకొల్పేలా చేసింది.

సాధారణంగా ఒక లీటర్ కూల్ డ్రింక్స్ ను ఓ నలుగురు అయిదుగురు స్నేహితులు కలిసి తాగడానికి కష్టపడతారు. అలా వారందరూ తలో గ్లాసు తాగి దానిని ఖాళీ చేస్తారు. అప్పటికే వారి పొట్ట బాగా నిండిపోయినట్లు అయిపోతుంది. కానీ మనం చెప్పుకునే ఈ ఎరిక్ బూకర్ మాత్రం నాన్ స్టాప్ గా రెండు లీటర్ల కూల్ డ్రింక్స్ ను తాగి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అదికూడా కేవలం ఆయన 18.45 సెకండ్ల‌ సమయంలోనే రెండు లీట‌ర్ల సోడాను తాగి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఆయన కూల్ డ్రింక్ తాగిన టైం కూడా చాలా తక్కువ. దీంతో గిన్నిస్ సంస్థ వారు ఆయన్ని సంప్రదించారు. ఎరిక్ ఒక రాప‌ర్ గా పనిచేస్తున్నాడు. ఆయన 9 రాప్ సాంగ్స్‌ చేసి వదిలాడు. ఇలా కూల్ డ్రింక్ సోడాను ఆయన తాగడంతో గిన్నిస్ సంస్థ వారు ఆ వీడియోను తమ యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.