టోక్యో ఒలింపిక్స్: ఆర్చ‌రీలో దీపికా దూకుడు, సెమీస్‌కి బాక్స‌ర్ ల‌వ్లీనా..నిరాశ‌ప‌రిచిన షూట‌ర్లు!

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నేడు ఇప్పటి వరకు జరిగిన వివిధ క్రీడాంశాల్లో భారత్ ఫ‌లితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ఇండియ‌న్ ఆర్చ‌ర్ దీపికా కుమారి దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఈ రోజు ఉద‌యం జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్‌లో ర‌ష్యా ఆర్చ‌ర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించి క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టింది.

Olympics: Deepika Kumari seals quarters berth with shoot-off win over  Perova | Olympics - Hindustan Times

అలాగే ఒలింపిక్స్‌లో బాక్స‌ర్ లవ్లీనా ఇండియాకు మ‌రో ప‌త‌కం ఖాయం చేసింది. శుక్ర‌వారం జరిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో విజ‌యం సాధించిన ల‌వ్లీనా సెమీఫైన‌ల్లో ఎంట్రీ ఇచ్చింది. ఒక‌వేళ సెమీస్‌లో ల‌వ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడ‌ల్ మాత్రం ఖాయం అవుతుంది.

BREAKING | Boxer Lovlina Borgohain wins India's second medal at Tokyo  Olympics

ఇండియన్ షూటర్లు మ‌ను బాక‌ర్‌, రాహి స‌ర్నోబ‌త్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. 25 మీట‌ర్ల పిస్ట‌ల్ ఈవెంట్‌లో 290 పాయింట్లతో మనుబాకర్ 15వ స్థానంతో, సర్నబోత్ రహీ 286 పాయింట్లతో 32వ స్థానంలో నిలిచి ఇంటి బాట ప‌ట్టారు.

Shooting Championship : Manu Bhaker & Rahi Sarnobat

ఇక మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ఓటమి పాలైంది. థాయిలాండ్‌కు చెందిన సుదాపోర్న్ చేతిలో 0-5 తేడాతో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. మొత్తానికి ఈ బాక్సర్ ప్రయాణం టోక్యోలో ముగిసింది.

World Cup Medallist Simranjit Kaur Seeking Employment to Make Ends Meet |  India.com