‘మా’ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అప్పుడేన‌ట‌?!

July 30, 2021 at 9:23 am

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్య‌వ‌హారం రోజు రోజుకు ఉత్కంఠ‌గా మారుతుంది. మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనీ కొంతమంది.. ఎన్నికలు పెట్టాలని మరికొంత‌మంది వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారు.

ఈ నేప‌థ్యంలోనే గురువారం కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్‌లైన్‌ ద్వారా ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ స‌మావేశంలో పాల్గొన్న వారంద‌రూ సెప్టెంబర్‌లో ఎన్నిక‌ల‌ను జర‌పాల‌ని ప్రాథమికంగా నిర్ణయించిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. అలాగే ఎన్నికలు జరిగే వరకూ ప్రస్తుత కార్యవర్గానికి అధికారం ఉంటుందని పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

ఇక ఆగస్టు 22న ‘మా’ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించబోతున్నార‌ట‌. ఈ సమావేశంలోనే మా ఎన్నిక తేదీపై పూర్తి క్లారిటీ రానుంద‌ని తెలుస్తోంది. కాగా, అధ్యక్ష ప‌దివి కోసం ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజ‌శేఖ‌ర్‌, హేమ‌, సీవీఎల్ నర్సింహరావు పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

‘మా’ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అప్పుడేన‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts