భ‌ర్త కార‌ణంగా డైల‌మాలో ప‌డ్డ శిల్పాశెట్టి కెరీర్‌?!

July 30, 2021 at 8:55 am

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార‌వేత్త‌ రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రాజ్ కుంద్రా గురించి ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తూ ఉన్నాయి. దాంతో కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా ముంబై కోర్టు కొట్టివేసింది.

ఇక మ‌రోవైపు భ‌ర్త కార‌ణంగా శిల్పాశెట్టి కెరీర్ కూడా డైల‌మాలో ప‌డింది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన శిల్పా ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్ స్టార్ చేసి హంగామా 2, నికమ్మ చిత్రాల్లో నటిస్తుంది. వీటిలో హంగామా 2 హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాగా.. నిక‌మ్మ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రోవైపు సూపర్‌ డాన్సర్ 4 అనే రియాలిటీ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శిల్పా.. దాదాపు 11 బ్రాండ్లకి అంబాసిడర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది.

అయితే భ‌ర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మార‌వ‌డంతో.. శిల్పా ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ల వ్యాల్యూ అమాంతంగా ప‌డిపోయింద‌ట‌. అలాగే హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న హంగామా 2కు పెద్ద‌గా రెస్పాన్స్ రావ‌డం లేద‌ట‌. దాంతో నిక‌మ్మ విడుద‌ల‌ను వాయిదా వేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇక సూపర్‌ డాన్సర్ 4 నుంచి కూడా శిల్పా త‌ప్పుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

భ‌ర్త కార‌ణంగా డైల‌మాలో ప‌డ్డ శిల్పాశెట్టి కెరీర్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts