ఏంటీ..`ప్రాజెక్ట్ కె`కు ప్ర‌భాస్ అన్ని డేట్స్ ఇచ్చాడా?

July 30, 2021 at 8:33 am

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. దీపికా పదుకొనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లె ఈ చిత్రం ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. మొద‌ట అమితాబ్ పై కొన్ని కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ భారీగా డేట్లు కేటాయించాడ‌ట‌

లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ప్రాజెక్టు కే కోసం ప్ర‌భాస్ ఏకంగా 200 రోజులు డేట్స్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు, త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ షూట్‌లో జాయిన్ అవ్వ‌నున్నాడ‌ని స‌మాచారం. కాగా, ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె తో పాటుగా ఆదిపురుష్‌, రాధేశ్యామ్‌, స‌లార్ చిత్రాలు కూడా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. మిగిలిన చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.

ఏంటీ..`ప్రాజెక్ట్ కె`కు ప్ర‌భాస్ అన్ని డేట్స్ ఇచ్చాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts