బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన న‌భా నటేష్‌..?!

July 21, 2021 at 8:38 am

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఒక్క‌సారిగా క్రేజ్ సంపాదించుకుంది న‌భా న‌టేష్‌. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న మాస్ట్రో మూవీ చేస్తున్న న‌భాకు.. ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు.. మ్యాచో హీరో గోపీచంద్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ న‌భా కొట్టేసింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Gopichand 30: Gopichand And Director Sriwass Team Up For Family Entertainer Movie

ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల క‌లిసి నిర్మిస్తున్నారు. ఇది గోపీచంద్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా న‌భా న‌టేష్‌ను ఎంపిక చేశార‌ని తాజాగా ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Gopichand 30 With Sriwass Under People Media Factory Announced - IndustryHit.Com

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, శ్రీ‌వాస్‌..గోపీచంద్ కాంబోలో వ‌చ్చిన ల‌క్ష్యం, లౌక్యం చిత్రాలు రెండూ మంచి విజ‌యాలు సాధించాయి. మ‌రి ఇప్పుడు వీరిద్ద‌రూ హ్యాట్రిక్ విజ‌యం సాధిస్తారో..లేదో.. చూడాలి.

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన న‌భా నటేష్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts