విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్‌ల‌కు అరుదైన గౌర‌వం..!

టాలీవుడ్ స్టార్ హీరోలైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ బాబు తాజాగా అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ 2021 తాజాగా విడుద‌లైంది. టాలెంటెడ్, డేరింగ్, పవర్ ఫుల్ వంటి భాగాల నుండి దేశ ప్రజలను అటు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో ప్ర‌తి ఏటా చోటు దక్కుతుంది.

Makers of Mahesh Babu's 'Sarkaru Vaari Paata' cancel update on film due to  pandemic | The News Minute

అయితే ఈ ఏడాది హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ లో మ‌న టాలీవుడ్ నుంచి విజ‌య్‌, మ‌హేష్‌లు స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇండ‌స్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి..ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత‌ల‌తో ప‌నిచేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ను మ్యాన్ విత్ ఎ మిడాస్ ట‌చ్ గా అభివ‌ర్ణించింది.

Kochi to welcome Arjun Reddy actor on Saturday | Vijay Devarakonda dear  comrade movie promotion

అలాగే మ‌హేష్ బాల‌న‌టుడి నుంచి టాలీవుడ్ సూప‌ర్ స్టార్ గా మారిన వైనం ఆక‌ట్టుకుంటుంద‌ని హ‌లో మ్యాగ‌జైన్ పూర్కొంది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్‌, విజ‌య్‌లు హ‌లో మ్యాగ‌జైన్ లో చోటు ద‌క్కించుకోవ‌డంతో.. వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Image