టాలీవుడ్ సీరియర్ హీరో, రాజకీయ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ..సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మంచి జరిగాలని, దుష్ణశక్తులు దరిచేరకూడని రకరకాల రత్నాలూ ధరిస్తుంటారు. అయితే బాలయ్య గురించి తెలియని మరో విషయం ఏంటంటే.. ఈయనకు బ్లాక్ కలర్ అంటే చాలా భయమట.
వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బాలయ్యకు బ్లాక్ కలర్ అంటే ఎందుకు భయం అనుకుంటున్నారా.. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనే అందుకు కారణం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రోజు 369 షూటింగ్ కోసం బాలకృష్ణ బ్లాక్ డ్రెస్ వేసుకుని..ఆ రోజంతా అదే డ్రెస్ లో ఉన్నారట.
అయితే అదే రోజు ఆయనకు ప్రమాదం జరిగింది. బ్లాక్ డ్రెస్ వేయడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని నమ్మిన బాలయ్య.. ఇక ఆ తర్వాత నుంచీ బ్లాక్ డ్రెస్ కు దూరంగా ఉన్నారట. కాగా, ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.