ఆక‌ట్టుకుంటున్న న‌య‌న‌తార `నీడ` ట్రైల‌ర్‌!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన చిత్రం `నీడ‌`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్‌.భట్టతిరై దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుద‌ల కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి పట్టుకోండి అనే డైలాగ్ తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్‌.. ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది. నితిన్‌ అనే చిన్నారి చెప్పిన థ్రిల్లింగ్ మర్డర్ క‌థ‌ ఆధారంగా లాయర్‌ జాణ్‌ హత్య కేసును ఎలా చేధించాడు అన్న కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కిన‌ట్టు ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

మొత్తానికి సూప‌ర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. కాగా, ఈ చిత్రంలో రోనీ డేవిడ్, సైజు కురుప్, లాల్, దివ్యప్రభ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే న‌య‌న్‌ భర్తగా ఫహద్ ఫాజిల్ అతిథి పాత్రలో కనిపిస్తాడు.