ఆ ద్రాక్ష రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ద్రాక్ష పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. ద్రాక్ష తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. అందుకే ద్రాక్ష పండ్లను తినని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. ద్రాక్ష పండు చాలా రుచిగానే కాదు వాటిని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలనేవి ఉంటాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ద్రాక్ష పళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ద్రాక్షలో ఒక కిలో ద్రాక్ష ధర చాలా తక్కువగానే ఉంటుంది. ద్రాక్షల్లో అనేక రకాలు అనేవి ఉంటాయి. అందులో వాటి వాటి రకాలను బట్టీ చూస్తే అవి రూ.50 నుంచి రూ.120 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఎర్రని ద్రాక్ష గుత్తి ధర మాత్రం 11 వేల డాలర్లు ఉంటుందనే విషయం చాలా మందికి తెలీదు. భారతదేశ కరెన్సీలో చూస్తే ద్రాక్ష ధర అక్షరాల రూ.7.5 లక్షలు ఉంటుంది. ఈ ధరను చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇంత ధర ఉండటం ఏంటి అనుకుని ఆశ్చర్యపోయారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఆ ఎర్ర ద్రాక్ష రికార్డులలోకెక్కింది. ఈ ద్రాక్ష కోసం నిర్వహించిన వేలంపాటలో భారీ రేటుకు అమ్ముడుపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ద్రాక్ష గుత్తికి ఇంత ధరా అంటూ షాక్ అవుతున్నారు. రుబీ రోమన్ ద్రాక్షగా పిలిచే ఈ ద్రాక్ష పండ్లను చాలా తక్కువగానే పండిస్తారు. ఈ ద్రాక్ష పండ్లు ఎంతో అందంగా ఎర్రగా కనిపిస్తాయి. ఈ ద్రాక్ష పండ్లను 2008 నుంచి పండించడం వల్ల అనేక మంది వీటి కోసం ఎగబడుతున్నారు. జపాన్‌లోని ఇషికావా దీవిలో ఈ ద్రాక్ష పండ్లను కొంత మొత్తంలోనే పండించనున్నారు. సీజన్ లో మొదటి విక్రయానికి ముందు ఒక ద్రాక్ష గుత్తిని వేలానికి పెట్టడం అలవాటు. దాన్ని కొనుగోలు చేసేందుకు వందలాది మంది పోటీపడతారు. 2019లో మొదటి ద్రాక్ష గుత్తిని కనజవాలో వేలానికి పెట్టడంతో ఆ ఆనవాయతీ కొనసాగుతోంది.