క్లైమాక్స్ కు చేరిన‌ వరుణ్ తేజ్ `గని`..అదిరిన న్యూ పోస్ట‌ర్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం గ‌ని. ఈ మూవీ ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టించ‌గా..జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

క‌రోనా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె మ‌ళ్లీ మొద‌లైంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే గ‌ని ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ అంతా పూర్తవుతుంది.

ఈ విష‌యాన్ని తెలుపుతూ.. చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ న్యూ పోస్ట‌ర్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రం జూలై 30న విడుద‌ల అవుతుంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల బ‌ట్టీ.. ఆ తేదీని గ‌ని ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. అయితే సెప్టెంబ‌ర్‌లో గ‌ని విడుద‌ల ఉండొచ్చ‌ని టాక్ న‌డుస్తోంది.

Image