బ్రేక‌ప్ అయింది..ఓపెన్‌గా సీక్రెట్‌ బ‌య‌ట‌పెట్టిన అనుపమ!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే అనుప‌మ‌.. అందం, అభిన‌యం, త‌న‌దైన న‌ట‌న‌తోనే ప్రేక్ష‌కులు బాగా చేర‌వైంది.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో 18 పేజీలు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, కోలీవుడ్‌లో తల్లిపోగాదే చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. సోష‌లో మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుప‌మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభినుల‌తో ముచ్చ‌ట్లు పెట్టింది. దాంతో అభిమాను, నెటిజ‌న్లు వృత్తిపరమైనవే కాకుండా వ్యక్తిగతమైన విష‌యాల‌ను కూడా ట‌చ్ చేస్తూ ప్ర‌శ్నించారు.

ఈ నేప‌థ్యంలోనే ఓ నెటిజ‌న్ మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా? అని ప్ర‌శ్నించాడు. అందుకు అనుప‌మ‌.. `అవును నా జీవితంలో నిజమైన ప్రేమ ఒకప్పుడు ఉండేది. గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కానీ, అత‌డితో బ్రేక‌ప్ అయిపోయింది` అని ఓపెన్‌గానే సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసింది. దాంతో అనుమ‌ప బ్రేక‌ప్ చెప్పిన ఆ వ్య‌క్తి ఎవ‌రా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.