బ్రేకింగ్ : ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!

June 19, 2021 at 1:36 pm

ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో ఎడ్యుకేష‌న్‌పై ఎన్నోఅనుమానాలు నెల‌కొన్నాయి. అయితే వాటిల్లో కొన్నింటికి క్లారిటీ ఇస్తోంది. ప్ర‌భుత్వం. ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్‌ కొద్ది స‌మ‌యం క్రితం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆగస్టు నెంల 19 నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి ప్ర‌క‌టించారు. ఇందుకోసం ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆయ‌న వెల్లడించారు. కాగా జూలై 25 వరకు అప్లికేష‌న్లు స్వీకరించనున్నట్లు ఆయన వివ‌రించారు.

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, మెడికల్ కామన్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు అపరాధ రుసుము లేకుండా జూన్ 26వ తేదీ నుండి జులై 25వ తేదీ వరకు ఎంసెట్ అప్లికేష‌న్ల‌ను స్వీకరిస్తామ‌ని ఆయన వివ‌రించారు. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ను కూడా సెప్టెంబర్ నెలలో నిర్వహించే చాన్స్ ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. స్టూడెంట్లు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఎగ్జామ్ రాయాల‌ని చెప్పారు.

బ్రేకింగ్ : ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts