సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్ రాబోతోందా … ?

June 19, 2021 at 3:14 pm

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఇక ఈ క‌రోనా వ‌చ్చాక ఓటీటీల జోరు అంతా ఇంతా కాదు. పెద్ద సినిమాలు కూడా వీటిలోనే వ‌స్తున్నాయి. క‌రోనా టైమ్‌లో వీటి డిమాండ్ అమాంతం పెరిగింద‌ని చెప్పాలి. దీంతో స్టార్ హీరోయిన్ ల‌తో పాటు హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సమంత, కాజల్ అగర్వాల్ , తమన్నా లాంటి వాళ్లు వెబ్ సిరీస్ ల లోనూ, ప్రముఖ ప్రోగ్రామ్‌ల‌తో ఒటీటీలో మెరుస్తున్నారు.

కాగా హాట్ స్టార్‌లో లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మన ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈమె మరో వెబ్ సిరీస్ ను కూడా లైన్‌లో పెట్టిన‌ట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కొత్త సిరీస్ కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెబుతున్నారు. ఇక ఈ సిరీస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెర‌కెక్కుతున్న‌ట్టు సమాచారం. ఇక ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ తో పాటు, ప్రముఖ నటుడు అయిన సుబ్బరాజు న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాజల్ దీనికి బాగానే రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్ రాబోతోందా … ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts