మిల్కాసింగ్ గురించి సూపర్ స్టార్ ఇలా…!

June 19, 2021 at 1:19 pm

ఇండియ‌న్ స్పోర్ట్స్ దిగ్గ‌జం అయిన లెజండరీ అథ్లెట్‌గా పేరున్న మిల్కాసింగ్‌ (91) మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఆయ‌న కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత వచ్చిన కొన్ని అనారోగ్య సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతుండ‌గానే మ‌ర‌ణించారు. ఆయ‌న‌కు ఒక్క‌సారిగా జ్వ‌రం పెరిగి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ విప‌రీతంగా త‌గ్గిపోవ‌డంతో శ్వాస ఆడ‌క మృతి చెందారు.

దీంతో ఆయ‌న మృతిప‌ట్ల దేశ‌వ్యాప్తంగా చాలామంది ప్ర‌ముఖులు, సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఇదే సంద‌ర్భంగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కూడా త‌న ట్విట్ట‌ర్‌లో మిల్కాసింగ్ మృతికి సంతాపం తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో మిల్కాసింగ్ గొప్ప‌త‌నం గురించి కూడా మ‌హేష్‌ బాబు చెప్పారు. మిల్కాసింగ్ మ‌ర‌ణానికి దేశానికి తీర‌ని న‌ష్టం అని వివిరచారు. ఇక మ‌హేష్‌ బాబు పెట్టిన ట్వీట్‌కు చాలా త‌క్కువ టైంలోనే 15 వేల లైకులు, 3,800 రీ ట్వీట్లు వ‌చ్చి ప‌డ్డాయి. ఇంకా ట్వీట్లు వ‌స్తూనే ఉన్నాయి.

మిల్కాసింగ్ గురించి సూపర్ స్టార్ ఇలా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts