హైకోర్ట్ కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు..?

ఏపీ ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ నియంత్రణపై గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై విచారణ జరిగింది.

కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదని హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళింది. తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారని, 100 టన్నుల ఆక్సిజన్ లో మహారాష్ట్ర కు 97 టన్నులు, ఏపీకి 3 టన్నుల సరఫరా చేశారని మండిపడింది. దీంతో కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాల అవసరాలకు సరిపడా సరఫరా బ్యాలెన్సింగ్ చేస్తామని కేంద్రం తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.