అక్కడ సినిమా షూటింగ్‌లపై నిషేధం..?

భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు కరోనా తీవ్రతను బట్టి పలు రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూలను విధించాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు రకరకాల కార్యకలాపాలపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రంలో కూడా ఇప్పటికే లాక్‌ డౌన్ విధించారు. లాక్ డౌన్ అమలులో ఉండగానే ఇప్పుడు ఆంక్షలను మరింత కఠిన తరం చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో ఇండోర్‌, ఔట్‌ డోర్ సహా అన్ని రకాల సినిమా, సీరియల్ షూటింగ్‌ లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.