సినీ గేయ రచయిత అదృష్టదీపక్ మృతి..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులను కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజాగా తెలుగు సినీ గేయ రచయిత, కవి అదృష్ట దీపక్( 70) కరోనాతో కన్నుమూసారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఆయన “ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి. ఏటికెదురు నిలిచాయి” (యువతరం కదిలింది), “నేడే మేడే’ (ఎర్రమల్లెలు), “మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం” (నేటి భారతం) వంటి పాటలను రచించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన అదృష్ట దీపక్ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో నివసిస్తున్నారు. ఇటీవల కరోనా బారిన పడి.. దురదృష్టవశాత్తూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.