వైరల్ అవుతున్న సమంత ఇల్లు వీడియో..!

May 16, 2021 at 3:22 pm

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తోంది. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమంత ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్ తో, తన డాగ్ తో గడుపుతుంది. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. ఆమె తన ఇల్లును చాలా సార్లు తన గార్డెనింగ్ సమయంలో చూపిస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం సమంత తన గార్డెనింగ్, డాగ్ తో గడుపుతున్న సమయంలో తన ఇల్లుని కూడా చూపించింది. కిచెన్ లో వంట చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. సమంతకు ఇంట్లోనే కూరగాయలు పండించడం అలవాటు. దాంతో తాను ఇంట్లోనే రకరకాల కూరగాయలను పండిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఈ దృశ్యాలన్నీ చూడవచ్చు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తోంది.

వైరల్ అవుతున్న సమంత ఇల్లు వీడియో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts