బెస్ట్‌ఫ్రెండ్‌తో ప‌వ‌న్‌కు ఎందుకు చెడింది…!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చాలా సింపుల్‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ స‌న్నిహితులుగా ముద్ర‌ప‌డిన వారంతా హాజ‌ర‌య్యారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ఆలీ, నిర్మాత సురేష్‌బాబుతో పాటు ప‌వన్‌కు ఇండ‌స్ట్రీలో బాగా కావాల్సిన వాళ్లంతా హాజ‌ర‌య్యారు. అయితే ప‌వ‌న్‌తో దాదాపుగా ద‌శాబ్దంన్న‌ర‌గా ట్రావెల్ అవుతూ, ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర‌ప‌డిన నిర్మాత‌, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ‌ర‌త్‌మార‌ర్ మాత్రం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు.

2003లో ప‌వ‌న్ డైరెక్ట్ చేసిన జానీ సినిమా టైం నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జానీ సినిమాకు శ‌ర‌త్‌మ‌రార్ స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇక ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు సినిమాల‌ను శ‌ర‌త్‌మ‌రార్ త‌న నార్త్‌స్టార్ బ్యాన‌ర్ మీదే నిర్మించారు. ప‌వ‌న్ ఇండ‌స్ట్రీలో బాగా న‌మ్మే వ్య‌క్తుల్లో శ‌ర‌త్ ఒక‌రు అని అంద‌రూ చెపుతుంటారు. ఇక కాట‌మ‌రాయుడు సినిమా త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగింద‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌. వీరి గ్యాప్‌కు ఓ కార‌ణం కూడా వినిపిస్తోంది.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ సినిమా కొన్న బ‌య్య‌ర్లు త‌మ‌కు న్యాయం చేయాల‌ని ప‌వ‌న్‌ను క‌లిశారు. కొంద‌రు అయితే దీక్షలు కూడా చేశారు. ఆ టైంలో కొంత మొత్తాన్ని ప‌వ‌న్ తిరిగి బ‌య్య‌ర్ల‌కు ఇవ్వాల‌ని అనుకున్నారు. అయితే అప్పుడు అడ్డుప‌డ్డ శ‌ర‌త్‌మరార్ త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌తో మ‌రో సినిమా తీస్తున్నామ‌ని, ఆ సినిమాను స‌ర్దార్ కొన్న బ‌య్య‌ర్ల‌కే త‌క్కువ రేట్ల‌కు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

అయితే మాట త‌ప్పిన శ‌ర‌త్ కాట‌మ‌రాయుడు రిలీజ్ టైంలో ఆ సినిమాను సర్దార్ బ‌య్య‌ర్ల‌కు అమ్మ‌కుండా ఇత‌రుల‌కు అమ్మేశారు. అప్పటి నుంచి ప‌వ‌న్ శ‌ర‌త్‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ప‌వ‌న్ ఆఫీస్ ప్రారంభోత్స‌వానికి కూడా శ‌ర‌త్ రాలేదు. రాజకీయాలకు శరత్ మరార్ కి సంబంధం లేదని అనుకున్నా చుట్టం చూపుగా అయినా ఈ వేడుకకు హాజరై ఉండేవాడని, పవన్ – శరత్ మరార్ మధ్య విభేదాలు ఉండడం వల్లే మ‌నోడు రాలేద‌ని తెలుస్తోంది.

22713196_483204242078856_6062817090018110813_o