బాహుబలి సీరిస్ సినిమాలతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. బాహుబలిలో శివగామిగా ఆమె విశ్వరూపం చూపించేసి ఇండియన్ సినీ అభిమానుల మదిల చెరగని ముద్రవేసింది. తాజాగా ఆమెకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అల్లుడు కాబోతున్నాడు. అల్లుడు అంటే ఆమెకు రియల్ అల్లుడు కాదు సుమా….రీల్ అల్లుడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే ‘యుద్ధం శరణం’ సినిమా తరువాత నాగ చైతన్య సినిమా త్వరలో మొదలుకాబోతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ కూడా అనుకుంటున్నట్టు మ్యాటర్ లీక్ అయ్యింది. ఈ సినిమాకు ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. పెళ్లి తరువాత నాగ చైతన్య చెయ్యబోతున్న సినిమా ఇదేకావడం విశేషం.
‘శైలజ రెడ్డి అల్లుడు’ టైటిల్‌లో శైలజ పాత్ర ప్రముఖ నటి రమ్యకృష్ణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అంటే శైలజారెడ్డి అల్లుడిగా నాగ చైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ చేస్తుందన్నమాట. ఈ విషయం త్వరలో చిత్ర యూనిట్ అనౌన్స్ చెయ్యనున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటుల, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.