నంద్యాల‌లో చంద్ర‌బాబు ఎలా గెలిచాడో చెప్పిన జ‌గ‌న్‌

నెల రోజులుగా తెలుగు ప్ర‌జ‌లంద‌రిని త‌న వైపు మ‌రల్చుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ అక్క‌డ 13 రోజుల పాటు మ‌కాం వేశారు. అయినా ఆ పార్టీ అభ్య‌ర్థి ఘోరంగా ఓడిపోయారు.

నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. చంద్రబాబుకు భయపడే ప్రజలు ఓట్లశారని జగన్ అభిప్రాయపడ్డారు. పోలీసులతో పాటు ప్రతిఒక్కరూ టీడీపీ గెలుపునకు సహకరించారన్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నిక గెలుపును త‌మ గెలుపు అని అనుకుంటే అంత‌కు మించిన మూర్ఖ‌త్వం ఉండ‌ద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

నంద్యాల‌లో సాధారణ ఎన్నికలు కాదు కాబట్టే టీడీపీ గెలిచింది. చంద్రబాబు తన అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు. రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఇక త‌మ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకున్న చంద్ర‌బాబు అక్క‌డ వారిచేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళ్లి గెలిస్తే దానిని తాము రిఫరెండంగా భావిస్తామన్నారు.

శిల్పా సోదరులు చాలా కష్టపడ్డారని, అయితే చంద్రబాబు అబద్ధాలే విజయం సాధించాయన్నారు. ఇక అధికార పార్టీ నుంచి వ‌చ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి ఆరేళ్ల తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారని, రాజ‌కీయాల్లో విలువ‌లు అన్న ప‌దానికి నిర్వ‌చ‌నంగా నిలిచిన శిల్పా సోద‌రుల‌కు ఈ సంద‌ర్భంగా త‌న హ్యాట్సాప్ అని జ‌గ‌న్ చెప్పారు.