ఏపీలో వైసీపీ ముంద‌స్తు వ్యూహం

ఏపీ పాలిటిక్స్‌లో నిన్న‌టి వ‌ర‌కు కాస్త స్త‌బ్దుగా ఉన్న ప్ర‌తిప‌క్ష వైసీపీ దూకుడు పెంచుతోంది. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉన్నా ఒక‌వేళ ఆరు నెల‌ల ముందుగా ఎన్నిక‌లు వ‌చ్చినా విజ‌యం సాధించేలా పోరాటానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పార్టీ పటిష్ట‌త‌కు, ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల ఎంపిక కోసం స‌రికొత్త ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి ప్లీన‌రీల నిర్వ‌హ‌ణ ప్లాన్ చేశారు.

ఈ నెలాఖ‌రులోగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో పార్టీ ప‌రంగా ఉండే లోటుపాట్ల‌ను ఇక్క‌డ స‌రి చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత జూన్ 19, 20, 21 తేదీల్లో జిల్లా స్థాయిలో ప్లీన‌రీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇక రాష్ట్ర స్థాయి ప్లీన‌రీ స‌మావేశాలు జూలై 8, 9 తేదీల్లో విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ విజ‌య‌వాడ ప్లీన‌రీలో ప‌లు తీర్మానాలు చేయ‌నున్నారు.

విజ‌య‌వాడ‌లో 13 వేల మంది కార్య‌క‌ర్త‌ల‌తో ఈ స్టేట్ ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌కు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఈ ప్లీన‌రీలోనే జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిషోర్‌ను వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు బ‌హిరంగంగా ప‌రిచ‌యం చేయ‌డంతో పాటు కీల‌క‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌శాంత్‌తో పొలిటిక‌ల్ క్లాసులు కూడా ఇప్పించ‌నున్నారు.

ఇక ఇప్ప‌టికే 21 మంది ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో జ‌గ‌న్ అక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థుల ఎంపిక‌కు ఇత‌ర రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు సర్వే నిర్వహించిన సంస్థను రాష్ట్రంలో రంగంలోకి దింపుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి ధీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు వీక్‌గా ఉన్న చోట సైతం బ‌ల‌మైన వారి కోసం జ‌గ‌న్ పెద్ద క‌స‌ర‌త్తు చేస్తున్నాడు.

ఫైన‌ల్‌గా 2019 ఎన్నిక‌ల కోసం వైసీపీ అప్పుడే గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసేసింది. జ‌గ‌న్ త‌న లోపాలు స‌రిచేసుకుంటూ ముందుకు వెళితే ఎన్నిక‌ల నాటికి పూర్తి స్థాయిలో రెడీ అవ్వొచ్చు.