2019లో గ్రేట‌ర్ బ‌రిలో కేటీఆర్‌…రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై క‌న్ను

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల త‌ర్వాత మంత్రి కేటీఆర్ ఎక్కువుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మీదే త‌న ఫోక‌స్ అంతా పెడుతున్నారు. గ్రేట‌ర్‌లో చిన్న చెత్త స‌మ‌స్య మీద అయినా కూడా త‌న‌కు సోష‌ల్ మీడియాలో ఎవ‌రైనా కంప్లైంట్ చేస్తే చాలు వెంట‌నే ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా ఆయ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు మంత్రి కేటీఆర్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అక్క‌డ ప్ర‌జ‌లు ఇచ్చిన రిజ‌ల్ట్‌కు బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్ 2019 ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌న్న చ‌ర్చ‌లు టీఆర్ఎస్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

కేటీఆర్ స్వ‌యంగా గ్రేట‌ర్ నుంచి పోటీ చేస్తే 2019 ఎన్నిక‌ల్లో ఆ ఎఫెక్ట్ మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల మీద కూడా ప‌డి విప‌క్షాలు మ‌రింత బ‌ల‌హీనం అవ్వ‌డంతో పాటు గ్రేట‌ర్‌లో టీఆర్ఎస్‌కు మ‌రిన్ని ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌న్న‌దే ఆయ‌న ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్ 2019లో ఖైర‌తాబాద్ నుంచి బ‌రిలో ఉంటార‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై ఆయ‌న ప్రాథ‌మికంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు కూడా స‌మాచారం.

ప్ర‌స్తుతం ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే రామ‌చంద్రారెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. ఇక్క‌డ టీఆర్ఎస్‌కు స‌రైన లీడ‌ర్ కూడా లేడు. బీజేపీ నుంచి చింత‌ల‌, కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దానం నాగేంద‌ర్ పోటీ చేస్తే వారిద్ద‌రి మ‌ధ్య ఓట్లు చీలి ఇక్క‌డ త‌న గెలుపు సులువ‌వుతుంద‌న్న నిర్ణ‌యానికి కేటీఆర్ వ‌చ్చాడ‌ట‌. గ‌తంలో ఇక్క‌డ నుంచి కేటీఆర్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి విజ‌య‌రామారావు కూడా గెలిచారు.

ఒక‌వేళ ఖైర‌తాబాద్ కానీ ప‌క్షంలో ఉప్ప‌ల్‌పై కూడా ఆయ‌న్న క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేరు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండ‌డం వ‌ల్ల ఇక్క‌డ పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌భాక‌ర్ గెలిచారు. దీంతో అక్క‌డ నిల‌బ‌డినా త‌న గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే అని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

ఓవ‌రాల్‌గా ఖైర‌తాబాద్ లేదా ఉప్ప‌ల్ బ‌రిలో కేటీఆర్ ఉండ‌డం క‌న్‌ఫార్మ్ అని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. సో ఈ లెక్క‌న సిరిసిల్ల‌కు కేటీఆర్ గుడ్ బై చెపుతున్న‌ట్టే. ఇక కేటీఆర్ గ్రేట‌ర్‌లోనే పోటీ చేయాల‌ని గ్రేట‌ర్ టీఆర్ఎస్ నాయ‌కులు కూడా కోరుకుంటున్నారు.