కొత్త న్యూస్ ఛానెల్‌..! ” జ‌న‌సేన‌ ” కు ప్ల‌స్సా..మైన‌స్సా..!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేస్తే అదే మీడియాలో వ‌చ్చేది…ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం సినిమా హీరో మాత్ర‌మే. ప‌వ‌న్‌కు అన్ని వ‌ర్గాల్లో క్రేజ్ ఉంది. అయితే ప‌వ‌న్ ఇక‌పై పూర్తిస్థాయి పొలిటిక‌ల్ స్టార్‌గా మార‌నున్నాడు.. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ పాలిటిక్స్‌లోకి వ‌స్తే మీడియాలోను అనుకూల మీడియా, వ్య‌తిరేక మీడియా రెండూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎదిగేందుకు ప‌వ‌న్‌ కూడా అనుకూల మీడియా ఉండాల్సింద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఇప్పుడు ఓ కొత్త న్యూస్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నార‌న్న వార్తలు ఇప్పుడు తెలుగు మీడియా వర్గాల్లో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. టీవీ-9 సీఈవోగా ఉన్న ర‌విప్ర‌కాష్ కొద్ది రోజులుగా ఎన్టీవీ అధినేత న‌రేంద్ర చౌద‌రితో క‌లిసి ఓ న్యూస్ ఛానెల్ ఏర్పాటు చేస్తార‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ర‌విప్ర‌కాష్‌, న‌రేంద్ర చౌద‌రి ఇద్ద‌రు వ‌చ్చారు.

ఈ క‌ల‌యిక త‌ర్వాత ఇప్పుడు మ‌రో సెన్షేష‌న‌ల్ న్యూస్ ఇండ‌స్ట్రీలో చ‌క్కెర్లు కొడుతోంది. ప‌వ‌న్‌-ర‌విప్ర‌కాష్ కాంబోలో కొత్త న్యూస్ ఛానెల్ వ‌స్తుంద‌ని…ఈ ఛానెల్ జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మీడియా సంస్థ‌ల్లో ఒక్కో ఛానెల్ ఒక్కో రాజ‌కీయ పార్టీకి స‌పోర్ట్ చేస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటోంది. ఒక‌టి రెండు ఛానెళ్లు మిన‌హా మిగిలిన ఛానెల్స్ అన్ని ఎవ‌రికో ఒక‌రికి డ‌ప్పు కొడుతున్నాయి.

ఇక చాలా ఛానెల్స్ అయితే త‌మ సిబ్బందికి జీతాలు ఇవ్వ‌లేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ టైంలో ప‌వ‌న్ కొత్త ఛానెల్ పెట్ట‌డం అంటే సామాన్య‌మైన విష‌యం కాదు. ప్ర‌స్తుతం జ‌న‌సేన క్లీన్ ఇమేజ్‌తో తెలుగు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ టైంలో ఈ పార్టీకి అనుబంధంగా ఛానెల్ వ‌స్తే అది కొన్ని వ‌ర్గాల‌తో పాటు జ‌న‌సేన అభిమానుల‌కే ప‌రిమిత‌మ‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. మ‌రి ప‌వ‌న్ ఈ విష‌యంలో ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో చూడాలి.