శాత‌క‌ర్ణి బుల్లితెర రికార్డు: ఒకే రోజు రెండుసార్లు టీవీలో

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కింది గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహన యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా రూ.77 కోట్లు కొల్ల‌గొట్టి బాల‌య్య కేరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది.

ఈ సినిమా వెండితెర మీద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ఇప్పుడు బుల్లితెర మీద‌కు రాకుండానే ఇంకో స‌రికొత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన శాత‌క‌ర్ణి మూడు నెల‌ల్లోనే ఉగాది కానుక‌గా బుల్లితెర‌లో ప్ర‌సార‌మ‌వుతోంది. అయితే ఇక్క‌డే స‌రికొత్త ట్విస్ట్ ఉంది. శాత‌క‌ర్ణి ఉగాది రోజునే రెండుసార్లు రెండు ఛానెల్స్‌లో ప్ర‌సార‌మ‌వుతూ బుల్లితెర మీద స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

సాధార‌ణంగా ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా బుల్లితెర మీద ప్ర‌సార‌మ‌వుతున్న‌ప్పుడు ఫ‌స్ట్ టైం ఒక‌సారే వేస్తారు. అయితే శాత‌క‌ర్ణి లాంటి సూప‌ర్ హిట్ సినిమా ఫ‌స్ట్ టైం టీవీలో వేస్తున్న‌ప్పుడు ఒకే రోజు రెండుసార్లు వేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. శాత‌క‌ర్ణిని

మార్చి 29న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయబోతున్నారు.

ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మా టీవీలో సినిమా ప్రసారమవుతుంది. మా టీవీలో షో కంప్లీట్ అయిన వెంట‌నే రాత్రి 9 గంట‌ల‌కు మా మూవీస్‌లో మ‌ళ్లీ స్టార్ట్ అవుతుంది. ఇలా గ్యాప్ లేకుండా శాత‌క‌ర్ణి రెండు షోలు చూసుకోవ‌చ్చు. మరి ఈ చిత్రానికి టీఆర్పీ రేటింగ్స్ ఎలా వస్తాయో…? బుల్లితెర మీద బాల‌య్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.