” కాట‌మ‌రాయుడు ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు

సినిమా రీమేక్‌, ఆ సినిమా ఇప్ప‌టికే తెలుగులో డ‌బ్ అయ్యింది…..టీవీల్లో టెలీకాస్ట్ కూడా అయ్యింది..చాలా మంది చూసేశారు. అయినా ఆ సినిమాకు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమా రిలీజ్ ఓ పండ‌గ‌లా జ‌రిగింది. ఇదంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు గురించే. త‌మిళ్‌లో అజిత్ వీర‌మ్ తెలుగు రీమేక్ కాట‌మ‌రాయుడు భారీ హంగామా మ‌ధ్య శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా క‌థ ఇప్పటికే తెలిసిందే అయినా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించ‌డంతో ఉద‌యం నుంచే జ‌నాలు థియేట‌ర్ల వ‌ద్ద పోటెత్తారు.

సర్దార్ గబ్బర్‌సింగ్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వచ్చిన కాటమరాయుడు. ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, నార్త్‌తో పాటు కాట‌మ‌రాయుడు ఓవ‌ర్సీస్‌లో సైతం భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమా రిలీజ్ కాన‌ట్టుగా 300 స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన కాట‌మ‌రాయుడుకు అక్క‌డ ప్రీమియ‌ర్ షోతోనే రికార్డు స్థాయిలో వ‌సూళ్లు వ‌చ్చాయి.

కాట‌మ‌రాయుడు ప్రీమియ‌ర్ల‌తోనే ఓవ‌ర్సీస్‌లో 6.15 ల‌క్ష‌ల డాల‌ర్లు (మ‌న క‌రెన్సీలో రూ 4.10 కోట్లు) కొల్ల‌గొట్టాడు. ఈ సినిమాను ఓవ‌ర్సీస్ సినీగెలాక్సీ సంస్థ రూ 11.5 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ప్రీమియ‌ర్ల‌తోనే రూ. 4 కోట్లు రాబ‌ట్టిన కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ వీకెండ్‌కే రూ.10 కోట్ల మార్క్‌ను ఈజీగా క్రాస్ చేసేస్తాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

వ‌చ్చే వారం పూరి జ‌గ‌న్నాథ్ రోగ్‌, వెంకీ గురు సినిమాలు వ‌స్తున్నాయి. ఈ లోగా కాట‌మ‌రాయుడు సోలోగా బాక్సాఫీస్‌ను కుమ్మేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఫ‌స్ట్ వీకెండ్‌, ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి కాట‌మ‌రాయుడు బాక్సాఫీస్ రికార్డుల‌ను, లెక్క‌ల‌ను ఎంత వ‌ర‌కు తారుమారు చేస్తాడో చూడాలి.