ముమైత్ డేట్ చేసిన న‌లుగురిలో ఇద్ద‌రి పేర్లు లీక్‌

టాలీవుడ్‌లో ప‌దేళ్ల క్రితం ముమైత్‌ఖాన్ పేరు చెపితే హాట్ ఐటెం సాంగ్స్‌కు ఈ అమ్మ‌డు కేరాఫ్ అడ్ర‌స్‌. ఐటెం సాంగ్స్‌లో ముమైత్ ఎంత‌లా త‌న అందాల‌ను బ్లాస్ట్ చేస్తుందో అదే స్థాయిలో త‌న మాట‌ల‌ను కూడా బ్లాస్ట్ చేస్తుంది. గ‌తంలో తాగిన మైకంలో తాను ఎవ‌రెవరితో క్లోజ్‌గా ఉందో చెప్పిన ఆమె ఇండ‌స్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది. ఆ టైం ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి పేరు ఆమె క్లోజ్ రిలేష‌న్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ముమైత్ మాట‌ల బ్లాస్టింగ్స్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ చాలా మంది ఆమెతో క్లోజ్‌గా ఉండేందుకే ఇష్ట‌ప‌డ లేదు. గ‌త కొంత‌కాలంగా మ‌మైత్‌కు తెలుగులో ఛాన్సులే లేవు. గ‌తేడాది వ‌చ్చిన బాల‌య్య డిక్టేట‌ర్ సినిమాలో టింగో…టింగో ఐటెం సాంగ్ ఒక్క‌టే ఆమెకు ఇటీవ‌ల వ‌చ్చిన పెద్ద ఆఫ‌ర్‌. ఇప్పుడు హీరోయిన్లే ఐటెం బామ‌లుగా మారిపోవ‌డంతో మ‌మైత్‌కు ఐటెం సాంగ్ ఛాన్సులు ఇచ్చేవారు కూడా క‌రువ‌య్యారు.

దీంతో చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ టంగ్ స్టిప్ కార్య‌క్ర‌మానికి తెర‌లేపింది. ఇందులో భాగంగా తాను న‌లుగురితో డేటింగ్ చేసిన‌ట్టు బ‌య‌ట‌పెట్టింది. ఫస్ట్ డేటింగ్ పర్సన్ తో నాలుగేళ్ల పాటు రిలేషన్ కొనసాగిందని, సెకండ్ రిలేష‌న్ మూడున్న‌రేళ్లు, మూడో ప‌ర్స‌న్‌తో జ‌స్ట్ రెండేళ్లు డేటింగ్ కొన‌సాగించాన‌ని చెప్పింది. ఇక లాస్ట్ రిలేష‌న్ మాత్రం కేవ‌లం యేడాదిన్న‌ర‌తోనే ముగిసింద‌ట‌.

ఓ వ్య‌క్తితో డేటింగ్ కోసం సర్జ‌రీ చేయించుకున్నాన‌ని…ఆ ఆపరేషన్ కు 27 లక్షలు ఖర్చయిందని వాపోయింది. ప్ర‌స్తుతం ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌తో కాలం గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే మ‌మైత్ డేటింగ్ చేసిన నలుగురు వ్య‌క్తుల్లో ఒక‌రు ఒకరు ఫేమస్ టీవీ ఆర్టిస్ట్ కమ్ సీరియల్ నిర్మాత కాగా మ‌రో వ్య‌క్తి ఓ స్టార్ కమెడియన్‌కు తమ్ముడు అన్న ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో జ‌రుగుతోంది.