సాయిధ‌ర‌మ్‌ మార్కెట్ బుడ‌గ పేలిపోయింది

చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా తయారయ్యింది, కొంత మంది యువ హీరోల తీరు అన్న టాక్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్‌లో ఇటీవ‌ల కాంబినేష‌న్ చూసి బ‌య్య‌ర్లు యంగ్ హీరోల సినిమాల మీద కోట్లు కుమ్మ‌రించేస్తున్నారు. ఆ హీరోల‌తో సినిమాలు చేసే నిర్మాత‌లు సైతం అదే రేంజ్‌లో వారిపై కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డులు పెడుతున్నారు.

తీరా సినిమాలు రిలీజ్ అయ్యాక చూస్తే వారి మార్కెట్ బుడ‌గ బేలిపోతోంది. అదంతా బ‌లుపు కాదు ..? వాపు ..? అని తేలిపోతోంది. ఇక హీరోలు త‌మ‌కు మించిన మార్కెట్ ఉంద‌ని చెపుతూ కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ సినిమా బడ్జెట్ ను పెంచడం..ఆ రేట్లకు బయ్యర్లపై సినిమా రుద్దడం కామన్ అయ్యింది. తాజాగా మెగా క్యాంపు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా దెబ్బ‌తింది.

సినిమాకు భారీ బ‌డ్జెట్ పెట్టారు. రూ.30 కోట్ల‌కు అమ్మారు. తీరా ఇప్పుడు సినిమాకు స‌రైన టాక్ లేదు. దీంతో విన్న‌ర్ బ‌య్య‌ర్లు నిండా మునిగిపోయారు. సాయి సినిమాల్లో సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ మాత్ర‌మే రూ.15 కోట్లు రాబ‌ట్టాయి. అయితే ఈ సినిమాను అంత‌కు మించి డ‌బుల్ రేట్ల‌కు అమ్మేశారు.

సాయి కూడా భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు. ర‌కుల్‌, మ‌లినేని గోపీచంద్, జ‌గ‌ప‌తిబాబు ఇలా క్రేజీ కాంబోలో విన్న‌ర్ తెర‌కెక్కింది. ఇప్పుడు టాక్ బాగో లేక నిర్మాత‌, బ‌య్య‌ర్లు నిండా మునిగారు. విన్న‌ర్ సినిమా చాలా చోట్ల ఫ‌స్ట్ డే నే హౌస్‌ఫుల్ కాలేద‌ని బ‌య్య‌ర్ల టాక్‌. సాయి మార్కెట్ విన్న‌ర్‌తో ఢాం అని పేలింద‌ని..ఇక‌నైనా ఈ హీరో త‌న ఒరిజిన‌ల్ మార్కెట్ తెలుసుకుని సినిమాలు చేస్తే మంచిద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.