రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై..! ఆ పోస్టు ద‌క్కేనా..!

టీడీపీ ఎంపీ రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్నారు. త‌న చిర‌కాల కోరిక అయిన ఒక‌ ప‌ద‌వి కోసం ఇక ప్ర‌జా జీవితం నుంచి శాశ్వతంగా దూరం కాబోతున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా పేరు సంపాదించిన ఆయ‌న‌.. ఇక 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కావాలు దాదాపు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు న‌రస‌న్న పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు!! పార్టీలు మారినా.. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఆయ‌న‌కు అంద‌ని ద్రాక్ష గానే మిగిలిపోతోంది. కానీ ఈసారి ఆయ‌న ఈ ప‌ద‌వి కోసం గ‌ట్టిగా ప్ర‌యత్నిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబుకు కూడా ఈ మేర‌కు గ‌ట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేయనని, విశ్రాంతి తీసుకుంటానని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఎప్పుడో ప్ర‌క‌టించారు. అయితే త‌న చిర‌కాల కోరిక టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఆయ‌న ఎంతో కాలంనుంచీ వేచిచూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఆ పదవి అందినట్లే అంది.. ఆఖరి నిమిషంలో మరొకరికి దక్కింది. ఎప్పటికైనా టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాలని రాయపాటి ఆశపడుతున్నారు. మరో రెండు మాసాలలో టీటీడీ ఛైర్మన్‌ పదవి ఖాళీ కాబోతోంది. దీంతో రాయ‌పాటి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఎంపీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసే యోచ‌నలో ఉన్న‌ట్లు స‌మాచారం.

రెండేళ్లు ఈ పదవి నిర్వహించిన ‘చదలవాడ కృష్ణమూర్తి’కి మళ్లీ ఆ పోస్టు దక్కే అవకాశాలు లేవు. టీటీడీ ఈవో కమ్మ సామాజికవర్గానికి చెందిన సాంబశివరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను త్వరలో ఆర్థికశాఖాధిపతిగా కానీ, రెవెన్యూ శాఖ పరిధిలోని ఎక్సైజ్‌, కమర్షియల్ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్లు స్టాంప్‌ల‌ శాఖాధిపతిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. త్వ‌ర‌లో జ‌రిగే అధికారుల బదిలీల్లోఆయ‌న‌ పేరు కూడా ఉందని సీఎంవో వర్గాల స‌మాచారం!

మ‌రోప‌క్క టీటీడీ ఛైర్మన్‌ పదవిని కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వాలని ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబును కోరుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో కానీ…మరే ఏ ఇతర ప్రభుత్వాల హయాంలో కానీ టీటీడీ ఛైర్మన్‌ పదవి ‘కమ్మ’ సామాజికవర్గానికి దక్కలేదు. కనీసం ఇప్పుడైనా ఆ పదవిని ఇవ్వాలని కమ్మస‌ అందులోనూ, నర్సరావుపేట ఎంపి రాయపాటికి ఆ పదవి ఇవ్వాల‌నే డిమాండ్ అధిక‌మ‌వుతోంది. దీంతో చంద్ర‌బాబు కూడా ఈసారి రాయ‌పాటి వైపే మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయని తెలుస్తోంది.