మ‌హేష్‌కు మైన‌స్‌గా మారిన సెంటిమెంట్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌పై సౌత్ ఇండియాలోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. రూ. 90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఇంకా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. అయితే సినిమా రిలీజ్ డేట్‌పై ఉన్న అనుమానాల‌ను ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ మాత్రం రివీల్ చేసేశారు.

ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మురుగ‌దాస్ కొంత స‌స్పెన్స్‌కు తెర‌దించేశారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే మ‌హేష్ స్టార్ డైరెక్ట‌ర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాకు ఓకె చెప్పాడు. డీవీవీ దాన‌య్య నిర్మించే ఈ సినిమా స్క్రిఫ్ట్ వ‌ర్క్ ప‌నిలో కొర‌టాల బిజీ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాకు సంబంధించి వ‌స్తోన్న ఓ వార్త మ‌హేష్‌తో పాటు మ‌హేష్ ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతోంది. గ‌తంలో మ‌హేష్ – కొర‌టాల కాంబోలో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నా..ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్‌ను తీసుకోవాల‌ని కొర‌టాల భావిస్తున్నాడ‌ట‌.

ఈ నిర్ణ‌య‌మే ఇప్పుడు మ‌హేష్‌ను బాగా టెన్ష‌న్ పెడుతోంద‌ట‌. గ‌తంలో మ‌హేష్ స‌ర‌స‌న కొత్త హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేసిన సినిమాల‌న్ని ప్లాప్ అయ్యాయి. వంశీ – టక్కరిదొంగ – అతిథి – 1 నేనొక్కడినే సినిమాల్లో కొత్త హీరోయిన్లతో జతకట్టాడు మహేష్. ఈ సినిమాల‌న్ని డిజాస్ట‌ర్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకు ఈ బ్యాడ్ సెంటిమెంట్ సెగ ఎక్క‌డ త‌గులుతుందో అని మ‌హేష్ కొత్త హీరోయిన్ విష‌యంలో కాస్త వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.