తెలంగాణ మంత్రులు & ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీట్లు మార్కులివే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం టీఆర్ఎస్ఎల్సీ మీటింగ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఇప్ప‌టికే పార్టీ ప‌రంగాను, ప్ర‌భుత్వంలోనే జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోన్న కేసీఆర్ మంత్రుల‌తో పాటు తెలంగాణ‌లో టోట‌ల్ ఎమ్మెల్యేలంద‌రి మీద చేయించిన స‌ర్వే లిస్టును వారికి అంద‌జేశారు. ఇక వచ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఏకంగా 101 -106 సీట్లు వ‌స్తాయ‌ని కేసీఆర్ సర్వేలో స్ప‌ష్ట‌మైంద‌ట‌.

స‌ర్వేల్లో ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌వైపే ఉన్న‌ట్టు మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశార‌ట‌. ఇక నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ సర్వే చేయించారు. ఆ సర్వే రిజ‌ల్ట్ జిల్లాల వారీగా ఇలా ఉంది.

ఆదిలాబాద్ :

జిల్లాలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప  70.90శాతం ఫ‌స్ట్ ర్యాంకులో ఉన్నారు. ఇక ఆ త‌ర్వాత వ‌రుస‌గా చెన్నూరు (ఎస్సీ): నల్లాల ఓదేలు – 65.10శాతం – బెల్లంపల్లి (ఎస్సీ): దుర్గం చిన్నయ్య – 64.90శాతం – మంచిర్యాల: దివాకరరావు నడిపెల్లి – 32.70శాతం – ఆసీఫాబాద్ (ఎస్టీ): కోవ లక్ష్మి – 62.90 శాతం – ఖానాపూర్ (ఎస్టీ): అజ్మీరా రేఖ నాయ‌క్‌ – 39.90 శాతం – ఆదిలాబాద్: జోగు రామన్న – 39.90 శాతం – బోథ్ (ఎస్టీ): రాథోడ్ బాపురావు – 36.10 శాతం – నిర్మల్: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – 58.40 శాతం – ముథోల్: గడ్డిగారి విఠల్ రెడ్డి – 63.20 శాతం మార్కులు వేయించుకున్నారు. జిల్లాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్‌, మంచిర్యాల దివాక‌ర్‌రావు, మంత్రి జోగు రామ‌న్న కేవ‌లం 30ల్లోనే ఉండిపోయారు.

మెదక్ :

సీఎం కేసీఆర్ 96.60 మార్కులతో మొదటి స్థానంలో ఉంటే – 82.30 స్కోర్ తో మంత్రి హరీష్ రావు రెండో స్థానం దక్కించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి 77.20 మార్కులిస్తే – కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి 66.30 మార్కులు పడ్డాయి. జిల్లాలో ఆంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ 44.90 శాతంతో చివ‌రి స్థానంలో ఉన్నారు.

నిజామాబాద్ :

జిల్లా కేంద్ర‌మైన నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేష్ గుప్తా 74.70తో ఫ‌స్ట్ ర్యాంకులో ఉంటే మంత్రి పోచారంకు 61 శాతం మార్కులు వ‌చ్చాయి. బోథ‌న్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌కు చాలా త‌క్కువుగా 39.40 శాతం మార్కులే వ‌చ్చాయి.

కరీంనగర్‌:

మంత్రి ఈటెల 89 మార్కుల‌తో ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తులో ఉన్నారు. జ‌గిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి 68 శాతం మార్కుల‌తో ఇక్క‌డ రెండో ప్లేసులో ఉండడం విశేషం. కేటీఆర్‌కు సైతం కేవ‌లం 60 మార్కులు వ‌చ్చాయి. వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్ 39 మార్కుల‌తో లీస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.

ఖమ్మం :

ఇక్క‌డ తిరుగులేని హ‌వా చెలాయిస్తోన్న పాలేరు ఎమ్మెల్యే కం మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఫ‌స్ట్ ప్లేసులో ఉంటే వైరా ఎమ్మెల్యే బాణోతు మ‌ద‌న్‌లాల్ చివ‌రి ప్లేసులో ఉన్నాడు.

మహబూబ్ నగర్ :

మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్‌కుమార్ 71 మార్కుల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నారు. నాగ‌ర్‌క‌ర్నూలులో మ‌ర్రి జ‌నార్థ‌న్‌రెడ్డికి 67 శాతంతో రెండో స్థానం ద‌క్కింది. మంత్రులు మాత్రం ఇక్క‌డ బాగా వెన‌క‌ప‌డ్డారు. జూపల్లికి 55.20 లక్ష్మారెడ్డి 51.40 మార్కులు వచ్చాయి. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ‌కు 65 మార్కులు వ‌చ్చాయి.

వరంగల్:

పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు 71 శాతం ఫ‌స్ట్ ర్యాంకులో ఉన్నారు. దాస్యం విన‌య్ భాస్క‌ర్ రెండో స్థానంలో ఉన్నారు. కొండా సురేఖకు 45 – మంత్రి చందూలాల్ కు 34 మార్కులు పడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అతి తక్కువగా 26.50 మార్కులు వ‌చ్చాయి.

నల్గొండ :

అవిభాజ్య న‌ల్గొండ జిల్లాలో భువ‌న‌గిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖ‌ర్‌రెడ్డి 82 శాతంతో ఎవ్వ‌రికి అంద‌కుండా ఫ‌స్ట్ ప్లేసులో ఉన్నాడు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 69.70 రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి 45.40 మార్కులు పడ్డాయి. కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి 31 శాతం మార్కుల‌తో లీస్ట్ ప్లేసులో ఉన్నారు. పీసీసీ చీఫ్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 53.70 – సీఎల్పీ లీడర్ జానాకు 63.20 మార్కులు రాగా…నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 53.70 మార్కులొచ్చాయి.

రంగారెడ్డి :

మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి 72.30 మార్కులు పడ్డాయి. ఇక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 70.50 మార్కులతో రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి మహేందర్ రెడ్డికి అతి తక్కువగా 38.30 స్కోర్ వచ్చింది.

హైదరాబాద్:

హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి 84.70 మార్కులతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. రెండో స్థానంలో చార్మినార్ ఎంఐఎం అహ్మద్ ఫాషా ఖాద్రీ 83.30 మార్కులొచ్చాయి. మంత్రికి పద్మారావు 61.50 తలసానికి 57.57 మార్కులు రాగా ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ 57.10 మార్కులు వ‌చ్చాయి. ఇక చివరలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి 34.80 మార్కులతో చివ‌రి స్థానంలో ఉన్నారు.