ఆ పదవులు బాబుకు కలిసిరావా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కేరీర్‌లో డిప్యూటీ, ఉప ప‌ద‌వులు క‌లిసి రాన‌ట్టే క‌న‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కేరీర్‌ను విశ్లేషిస్తే ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు డిప్యూటీ, ఉప ప‌దువుల ఇచ్చిన వాళ్లు కీల‌క టైంలో ఆయ‌న్ను న‌మ్మించి దెబ్బేశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ. కృష్ణ‌మూర్తి ఎమ్మెల్సీ విష‌యంలో బాబు మీద అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. దీంతో బాబుకు డిప్యూటీ, ఉప ప‌ద‌వులు క‌లిసిరావ‌న్న చ‌ర్చ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.

1995-2004 వ‌ర‌కు తొమ్మిదేళ్ల పాటు కంటిన్యూగా సీఎంగా ఉన్న చంద్ర‌బాబు 2004లో ఫ‌స్ట్ టైం ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చారు. ఆయ‌న 2004-2014 ప‌దేళ్ల పాటు ప్ర‌తిపక్షంలోనే ఉన్నారు. ఆ టైంలో ఆయ‌న డిప్యూటీ, ఉప ప‌ద‌వులు ఇచ్చిన వాళ్లంద‌రు చంద్ర‌బాబు క‌ష్టాల్లో ఉండ‌గా ఆయ‌న‌కు హ్యాండ్ ఇచ్చిన వాళ్లే.

2004-2009 మ‌ధ్య‌ చంద్ర‌బాబు టీడీఎల్పీ ఉపనేతలుగా సీనియ‌ర్లుగా ఉన్న మేడ్చ‌ల్ ఎమ్మెల్యే దేవేంద‌ర్‌గౌడ్‌, నాగ‌ర్‌క‌ర్నూలు ఎమ్మెల్యే నాగం జ‌నార్థ‌న్‌రెడ్డితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్ర‌స్తుత ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట‌రావుకు ఛాన్స్ ఇచ్చారు. వీరిలో దేవేంద‌ర్‌గౌడ్‌, క‌ళా వెంక‌ట‌రావు బాబుకు షాక్ ఇచ్చి చిరు ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిపోయారు.

2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ చాలా మంది సీనియ‌ర్లు లేకుండానే పోటీచేసి ఓడిపోయింది. దీంతో చంద్ర‌బాబు వ‌రుస‌గా రెండోసారి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు. అప్పుడు రెండోసారి టీడీఎల్పీ నేత‌గా ఎన్నికైన నాగం జ‌నార్థ‌న్‌రెడ్డి టీడీపీకి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్ బై చెప్పి తెలంగాణ న‌గార స‌మితి స్థాపించారు. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీలోకి చేరిపోయారు.

రాష్ట్రం విడిపోయినా చంద్ర‌బాబుకు ఈ బ్యాడ్ సెంటిమెంట్ గోల త‌ప్ప‌లేదు. 2014లో తెలంగాణ‌లో టీ టీడీపీ ఫోరమ్, టీడీఎల్పీ నేతలుగా పనిచేసిన ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాసయాదవ్ వంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి చంద్ర‌బాబు మీద తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. త‌న క్లాస్‌మేట్ అయిన కేఈ త‌న‌యుడికి జ‌గ‌న్ గాలం వేస్తున్నార‌ట‌. మ‌రి కేఈ బాబుకు షాక్ ఇస్తారా ?  లేదా ? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి. ఏదేమైనా చంద్ర‌బాబుకు ప‌దే ప‌దే డిప్యూటీ, ఉప ప‌ద‌వులు చేసిన వాళ్లు వ‌రుస షాకులు ఇస్తున్నారు.