ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా ఆ నిర్మాత బ్యాన‌ర్లో

వ‌రుస స‌క్సెస్‌ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంట‌న్న‌ది ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నా ఎన్టీఆర్ ఏ డైరెక్ట‌ర్‌తో క‌మిట్ అవుతాడ‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే ఉంది. ఇక ఎన్టీఆర్ ఇప్ప‌టికే వినాయ‌క్‌, రాజ‌మౌళి, బోయ‌పాటి శ్రీను, కొర‌టాల శివ, పూరి జ‌గ‌న్నాథ్, సుకుమార్‌ ఇలా చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టాడు.  చాలా రోజులుగా ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ […]

బాబు గ్రేడింగుల లెక్క ఇదే

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌ర్వేల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌రేళ్ల‌లోనే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మంత్రులు, ఎమ్మెల్యేల మీద స‌ర్వేలు చేస్తూ వారిని అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. బాబు గారి స‌ర్వే లెక్క‌ల‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎప్పుడు ఏం కొంప ముంచుకొస్తుందోరా బాబు అని టెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉంటున్నారు. ఇక తాజాగా విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని వ‌డ్డేశ్వ‌రంలోని కేఎల్ వ‌ర్సిటీలో ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్‌ల‌కు మూడు రోజుల పాటు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు […]

ఆ మంత్రి అవినీతికి చంద్ర‌బాబు బ్రేకులు

ఇప్పుడు రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాగించ‌డ‌మంటేనే కోట్ల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హార‌మైపోయింది. అందుకే విలువ‌ల‌తోకూడిన‌ రాజ‌కీయాలు సాగించేవారి సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి, ఎమ్మెల్యే ప‌ద‌విలో కూర్చోడానికే ఇర‌వై నుంచి ముప్పై కోట్లు ఖ‌ర్చ‌వుతోంద‌ని శాస‌న‌స‌భ్యులు అన‌ధికారికంగా మాట్లాడుతున్న‌పుడు వాపోతూ చెపుతున్న మాట‌. అందుకే గెలిచిన ద‌గ్గ‌ర్నుంచీ డబ్బులు తిరిగి రాబ‌ట్టుకునేందుకు…ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో నిల‌బ‌డేంద‌కు సొమ్ము స‌మ‌కూర్చుకునేందుకు… ఆదాయ మార్గాలేమున్నాయా… అని వెతుకుతున్న‌వారే నేటి రాజ‌కీయాల్లో అధిక శాతం. ప్ర‌స్తుతం రోడ్లు, భవనాల శాఖలో ఇదేర‌క‌మైన‌ […]

త‌మిళ‌నాడు అమ్మ వార‌సుడిగా ఆ స్టార్ హీరో

త‌మిళ‌నాడులో అమ్మ‌కు ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే అమ్మ వార‌సుడు ఎవ‌రు ?  ఇప్పుడు ఇదే అంశంపై అక్క‌డ మీడియాలో ఎడ‌తెగ‌లేని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్నాడీఎంకేను గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా తిరుగులేని శ‌క్తిగా న‌డిపిస్తున్న పురుచ్చిత‌లైవి, అమ్మ జ‌య‌ల‌లిత న‌డిపిస్తున్నాయి. అయితే వారం రోజులుగా అమ్మ ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల ఊహానాలు వెలువ‌డుతున్నాయి. అమ్మ కోలుకుంటే అంతా క్షేమం…లేనిప‌క్షంలో అమ్మ వార‌సుడు ఎవ‌రు అన్న‌దే ఇప్పుడు ఇక్క‌డ పెద్ద ఆన్స‌ర్‌లేని ప్ర‌శ్నగా మిగిలిపోయింది.  ఎంజీఆర్ మరణానంతరం జయలలిత 1989 లో […]

ఆ డైరెక్ట‌ర్‌పై చంద్ర‌బాబు నిఘా పెట్టారా..!

తెలుగు తెర వేల్పులుగా జ‌నం కొలిచిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు ఇద్ద‌రితోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు రూపొందించిన మేటి ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు.  ఆ మ‌హాన‌టులు ఇద్ద‌రి త‌రువాత‌ సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచింది కూడా దాస‌రేన‌ని చెప్పాలి. దాదాపు కొన్నిద‌శాబ్దాలుగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా దాని ప‌రిష్కారంలో  దాస‌రి నారాయ‌ణ‌రావుదే ప్ర‌ధాన పాత్ర‌. సినిమాల్లో ఎన్టీఆర్ తో స‌న్నిహితంగా ఉన్న‌దాస‌రి రాజ‌కీయాల్లో మాత్రం మొద‌టినుంచీ కాంగ్రెస్ పార్టీనే అనుస‌రించారు. ఆ […]

ఈడు గోల్డ్ ఎహే TJ రివ్యూ

సినిమా : ఈడు గోల్డ్ ఎహే రేటింగ్: 2.5/5 పంచ్ లైన్: ఈడు 1 గ్రామ్ గోల్డ్ ఎహే నటీనటులు: సునీల్, సుష్మారాజ్, రిచా పనయ్, జయసుధ, పునీత్ ఇస్సార్, నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్. సంగీతం; సాగర్ ఎం. శర్మ. సినిమాటోగ్రఫీ: దేవరాజ్. ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ ఆర్ట్: వివేక్ అన్నామలై. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర. నిర్మాత: రామబ్రహ్మం సుంకర కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు […]

లోకేష్‌కు చంద్ర‌బాబు షాక్ త‌ప్ప‌దా..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏ ప‌ని చేసినా.. ప‌ర్య‌వ‌సానాలపై ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించి మ‌రీ అడుగు ముందుకు వేస్తారు.  ఆయ‌న కొన్ని ముఖ్య విష‌యాల్లో తొంద‌ర‌గా నిర్ణ‌యం తీసుకోలేర‌ని వ్యాఖ్య‌లు వినిపించినా.. దాని వెనుక ఆయ‌న తీసుకునే జాగ్ర‌త్త‌లు దాగి ఉంటాయ‌ని గుర్తుంచుకోవాలి.  చంద్ర‌బాబు సుదీర్ఘ‌ రాజ‌కీయ‌ప్ర‌యాణంలో ఈ వైఖ‌రితో ఆయ‌న మంచి ఫ‌లితాలనే సాధించ‌గ‌లిగార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అత్య‌ధికుల అభిప్రాయం. తాజాగా  లోకేష్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌న్న డిమాండ్  పార్టీ వ‌ర్గాల‌నుంచి గ‌ట్టిగా వ‌చ్చినా చంద్ర‌బాబు అందుకు […]

ప్రేమమ్ TJ రివ్యూ

సినిమా : ప్రేమమ్ రేటింగ్ : 3.25/5 టాగ్ లైన్ : ట్రాజెడీ లేని నా ఆటోగ్రాఫ్ నటీనటులు: చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి, ప్రవీణ్, చైతన్యకృష్ణ. సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్ పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ మొదలయ్యే ప్రేమమ్ నాగచైతన్య రియల్ లైఫ్ కి […]

టీడీపీ అధ్య‌క్షుడికి చంద్ర‌బాబు హ్యాండ్‌

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత కిమిడి క‌ళావెంక‌ట్రావుకు ఎదుర‌వుతున్న వింత‌ ప‌రిస్థితి… బ‌హుశా మ‌రెవ్వ‌రికీ అనుభ‌వంలోకి వ‌చ్చి ఉండ‌దు. పార్టీకి ఆయన అత్యంత విధేయుడు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఏవిధ‌మైన అనుమానాలూ లేవు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తుల్లో ఆయ‌నా ఒక‌రు. ప్ర‌స్తుతం  క‌ళావెంక‌ట్రావు.. పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడు కూడా. ఇన్ని అర్హ‌త‌లున్నా ఆయనకు మంత్రి పదవి అనేది చాలాకాలంగా అందని ద్రాక్ష లాగానే ఉంటూ ఊరిస్తోంది. చంద్ర‌బాబు తాజాగా చేప‌ట్ట‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో […]