త‌న రెమ్యున‌రేష‌న్ లెక్క చెప్పిన రానా

టాలీవుడ్‌లో ద‌గ్గుపాటి వారి వార‌సుడు, ఆర‌డుగుల అజానుబాహుడు, భ‌యంక‌రత్వానికి ప్ర‌తిరూపం భ‌ళ్లాల‌దేవుడు ద‌గ్గుపాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2, ఘాజీ సినిమాల‌తో బిజీబిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే యేడాది ఆరంభంలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. దివంగ‌త లెజెండ్రీ నిర్మాత ద‌గ్గుపాటి రామానాయుడు మ‌నుమ‌డిగా, ద‌గ్గుపాటి సురేష్‌బాబు త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా త‌న‌కంటూ ఓ డిఫ‌రెంట్ స్టైల్‌తో దూసుకుపోతున్నాడు.

రానా ఇప్పుడు తెలుగులోనే కాదు, త‌మిళ్‌, హిందీ ప్ర‌జ‌ల‌కు కూడా త‌న సినిమాల‌తో బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. బాహుబ‌లి త‌ర్వాత రానా ఒక్క‌సారిగా ఇండియా వైజ్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. రానా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో త‌న రెమ్యున‌రేష‌న్ గురించి ఆస‌క్తిక‌రమైన ఆన్స‌ర్ ఇచ్చాడు.

త‌న మ‌న‌స్సుకు న‌చ్చిన క‌థ‌, పాత్ర దొరికితే త‌న‌కు రెమ్యున‌రేష‌న్‌తో ప‌ని లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. త‌న‌ను మెప్పించే పాత్ర‌, క‌థ‌తో ఎవ‌రైనా రైట‌ర్లు, ద‌ర్శ‌కులు వ‌స్తే తాను ఫ‌స్ట్ ప్ర‌యారిటీ వాటికే ఇస్తాన‌ని చెప్పాడు. రెమ్యున‌రేష‌న్ గురించి తాను అస్స‌లు ఆలోచించ‌న‌ని రానా అన్నాడు. అయితే సినిమాకు లాభాలు వ‌స్తే వాటిల్లో వాటా మాత్రం త‌ప్ప‌కుండా తీసుకుంటాన‌ని అన్నాడు.

న‌టుడిగా రిస్క్ తీసుకోవాల్సిన టైం వ‌చ్చిన‌ప్పుడు రిస్క్ చేయ‌క‌పోతే ఎలా అని కూడా రానా ప్ర‌శ్నించాడు. ఏదేమైనా రానా లాంటి వ్య‌క్తికి క్రేజ్‌, ప్ర‌తిష్ట, హిట్ సినిమాలు కావాలి కాని, డ‌బ్బుతో ప‌నేం ఉంది..?