సునీల్ మార్కెట్ ఎలా దిగ‌జారిందో తెలిస్తే షాకే

టాలీవుడ్‌లో ప్ర‌తి యేడాది 125-150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో  స‌క్సెస్ రేటు 20 శాతం కూడా ఉండ‌డం లేదు. పెద్ద హీరోల సినిమాల‌తో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాల వ‌ర‌కు శాటిలైట్ మార్కెట్‌కు వ‌చ్చిన ఇబ్బంది లేదు. అయితే ఓ 50 సినిమాలు అయితే కేవ‌లం శాటిలైట్ మార్కెట్ కోస‌మే తీస్తున్నారు. కామెడీ సినిమాల‌కు కూడా శాటిలైట్ మార్కెట్ బాగానే ఉంటుంది.

కామెడీ హీరోలు అయిన న‌రేష్‌, సునీల్ లాంటి హీరోల సినిమాల‌కు శాటిలైట్ బాగానే గిట్టుబాటు అవుతుండేది. న‌రేష్‌కి వ‌రుస ఫ్లాపులు ఎదురైనా.. శాటిలైట్ మార్కెట్ విష‌యంలో ఇబ్బంది లేదు. అందుకే న‌రేష్‌కు వ‌రుస‌గా 10 ప్లాపు సినిమాలు వ‌చ్చినా అత‌డితో సినిమాలు చేసేందుకు నిర్మాత‌లు క్యూలోనే ఉంటారు. ఇక క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ ప‌రిస్థితి మాత్రం ఇందుకు చాలా రివ‌ర్స్‌గా ఉంది.

ముందు సునీల్‌కు ఒక‌టి రెండు హిట్లు వ‌చ్చిన‌ప్పుడు ప‌రిస్థితి బాగానే ఉంది. సునీల్ వ‌రుస ప్లాపుల్లో ప‌డ‌డంతో ఇప్పుడు సునీల్ సినిమా అంటేనే శాటిలైట్ హ‌క్కులు తీసుకునేందుకు ఏ ఛానెల్ కూడా ముందుకు రాని ప‌రిస్థితి నెల‌కొంది. జ‌క్క‌న్న‌ క‌మ‌ర్షియ‌ల్‌గా ఓకే అనిపించుకొన్న సినిమా. రూపాయి పెడితే.. పావ‌లా పోయింది. ఆ సినిమాకే ఇంకా శాటిలైట్ కాలేదు.

ఇక వీడు గోల్డ్ ఎహే ప‌రిస్థితి మ‌రీ ఘోరం. రూపాయి పెడితే 50 పైస‌లు కూడా రాలేదు. ఇక ఈ సినిమాకు మాత్రం మంచి శాటిలైట్ రేటు ప‌లుకుతుంద‌ని ఆశించ‌డం అత్యాశే. ఈ సినిమా రిలీజ్‌కు ముందు రూ.2 కోట్ల శాటిలైట్ ఆఫ‌ర్ వ‌చ్చింది. నిర్మాత‌లు అంత‌కు మించి రూ.3 కోట్ల వ‌ర‌కు ఆశించారు. ఇప్పుడు నిర్మాత‌లు కోటిన్న‌ర ఇవ్వ‌మంటున్నా ఛానెల్స్ మాత్రం కోటికి కూడా ముందుకు రాని ప‌రిస్థితి.

సునీల్‌కు శాటిలైట్ మార్కెట్ కూడా లేక‌పోవ‌డంతో సునీల్‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు ధైర్యం చేయ‌డం క‌ష్ట‌మే. ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొడితే గానీ.. సునీల్ మ‌ళ్లీ నిర్మాతల్లో, ప్రేక్ష‌కుల్లో న‌మ్మ‌కం తీసుకురాలేడు. మ‌రి ఆ హిట్ ఎప్పుడొస్తుందో ?  వెయిట్ చేయ‌డ‌మే..!