కేటీఆర్‌కు క‌విత షాక్ ఇస్తుందా ఏంటి

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇప్పుడు ఓడ‌లు అనుకున్న‌వి తెల్లారేస‌రికి బ‌ళ్లుగా మారిపోవ‌డం పాలిటిక్స్‌లోనే సాధ్యం. ఇప్పుడీ స్టోరీ అంతా ఎందుక‌నుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవ‌డం స‌హా దాని అభివృద్దికి ప‌గ‌లు రాత్రి అనే తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతున్న కేటీఆర్ భ‌విత‌వ్యం త్వ‌ర‌లోనే మారిపోతుంద‌ట! అంటే ఆయ‌న ఏ సీఎం అయిపోతార‌ని కాదు. ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఇప్పుడున్న‌దానిక‌న్నా ఏమీ బెట‌ర్ పొజిష‌న్‌కి వెళ్ల‌ద‌ట‌. అదేంటి అనుకుంటున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ త‌ర్వాత కేటీఆర్ పేరే విన‌బ‌డుతోంది. అంటే కేసీఆర్ వార‌సుడిగా ఆయ‌న సీఎం పీఠం ఎక్క‌డం ఖాయం అంటూ ఇప్ప‌టి వ‌ర‌కు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

అయితే, ఇక‌పై అంత సీన్‌లేద‌నే వ్యాఖ్య‌లు విన‌బ‌డుతున్నాయి. అయితే, కేటీఆర్‌కి ఎర్త్ పెట్టే పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ఎవ‌రికి ఉంద‌ని కదా సందేహం. అక్క‌డికే వ‌స్తే.. సాధార‌ణంగా టీఆర్ ఎస్‌లో కేటీఆర్ కి ఎర్త్ పెట్టే ప‌వ‌ర్ ఎవ‌రికీ లేదు. సొంత మేన‌మామ‌, తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ర్యాకెట్ వేగంతో స్పందించిన హ‌రీష్‌రావును కూడా కేటీఆర్ ప‌క్క‌కు నెట్టేసి ప్ర‌స్తుతం మంత్రిగా దూసుకుపోతున్నారు. కాబ‌ట్టి హ‌రీష్ ఎట్టిప రిస్థితిలోనూ కేటీఆర్‌కి పోటీ ఇచ్చే ప్ర‌స‌క్తే లేదు. మ‌రి ఇంకెవ‌రై ఉంటారా? అని క‌దా అనుమానం. కేటీ ఆర్‌కి ఎర్త్ ఆయ‌న ఇంట్లోనే ఉంద‌ట‌! ఇది జ్యోతిష్యులు చెబుతున్న‌మాట‌. కేసీఆర్ ఎక్కువ‌గా ఆధ్యాత్మిక రంగాన్ని నమ్ముతారు.

అప్ప‌ట్లో చండీ హోమం చేసినా.. ఇటీవ‌ల జిల్లాల‌కు ప్రారంభం చేసినా ఆయ‌న పూర్తిగా పండితుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునే చేశారు. ఇక‌, ఇప్పుడు అదే జ్యోతిష్యులు కేటీఆర్‌కి ఎర్త్ ఆయ‌న ముద్దుల చెల్లెలు క‌వితే న‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటుతో తెలంగాణ ఉద్య‌మంలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయ‌డంతోపాటు బ‌తుక‌మ్మ‌కు భారీ స్థాయిలో ప్ర‌చారం తీసుకువ‌చ్చి ప్ర‌స్తుతం నిజామాబాద్ నుంచి పార్లెమెంటుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు క‌విత‌. అయితే, ఈమె భ‌విష్య‌త్తులో సీఎం సీటును ఎక్క‌డం ఖాయం అని అంటున్నారు జ్యోతిష్యులు. దీంతో కేటీఆర్‌కి క‌విత షాక్ ఇస్తుందా ఏంటి అని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఇప్పుడు ఇదే విష‌యం సోష‌ల్ మీడియా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ ప్రిడిక్ష‌న్‌కు బ‌లం చేకూర్చే విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ‘తండ్రులంతా చాటా క‌ఠిన‌మైన బాసులు’ అంటూ ఇటీవ‌ల కేటీఆర్ చేసిన ట్వీటు, ‘మంత్రి హ‌రీష్ రావుకు త‌న సంపూర్ణ స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయి’ అంటూ ఈ మ‌ధ్య‌నే సీఎం కేసీఆర్ చేసిన కామెంట్… ఈ రెండింటి మ‌ధ్యా జ్యోతిష్కుడి అభిప్రాయాన్ని చొప్పించి కొన్ని వాద‌న‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక‌, సెంటిమెంట్‌ను ఎక్కువ‌గా విశ్వ‌సించే సీఎం కేసీఆర్ వాస్తు బాలేద‌ని ఏకంగా స‌చివాల‌యానికి కూడా వెళ్ల‌డం మానేశారు. మ‌రి, ఈ ప్రిడిక్ష‌న్ ఆయ‌న వ‌ర‌కూ చేరితే ఎలాంటి స్పంద‌న ఉంటుందో చూడాలి.