సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ […]
Tag: TRS Party
టీఆర్ఎస్‌లోకి దిల్ రాజు… అక్కడ నుంచే పోటీ…?
తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇది కొత్త న్యూస్ కాదు. ఆయన గత ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు వ్యాపారపరంగా మరింత ముందుకు దూసుకు పోయారు. ఈ క్రమంలోనే ఆయన చూపు వచ్చే ఎన్నికలపై పడినట్టు తెలుస్తోంది. […]
కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదా..!
సింగరేణి, కోల్‌బెల్ట్ ఏరియా పరిధిలోని నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? కేంద్ర వైఖరికి నిరసనగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా..? తమ అసమ్మతిని ఓట్ల రూపంలో తెలియజేసేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారా..? ఇక ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి ఎదురీత తప్పదా..? అంటే పరిశీలకులు అవుననే సమాధానాలు ఇస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆయా రంగాల ఉద్యోగులు ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. ఎల్ఐసీ, […]
రేవంత్ వలలో చిక్కని ఆ మంత్రులు..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పన్నిన వ్యూహంలో టీఆర్ఎస్ మంత్రులు ఇరుక్కోలేదా..? ఆయన విసిరిన వలకు ఆ చేపలు చిక్కలేదా..? రేవంత్ దెబ్బకు ఆ మంత్రి ఒంటరి వారయ్యారా..? ముందే పసిగట్టిన మిగతా మంత్రులు సైలెంట్ అయ్యారా..? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీంతో రేవంత్ మరో వ్యూహం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. రెడ్డి కులస్థులకు అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెడ్లకు అధికారం కట్టబెట్టాలని.. […]
ఏపీ సరే.. మరి తెలంగాణ సంగతేంది పవన్ సార్?!
నాయకులు ఎవరైనా.. ఒకవైపే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒకవైపే చూస్తే.. ఎలా ఉంటుంది.? తిట్టిపో యరా? విమర్శలు గుప్పించరా? ఇదే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలోనూ జరుగుతోంది. ఆయన తెలంగాణలోనూ పోటీ చేస్తానని.. ఏకంగా 30 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే.. తెలం గాణ ప్రజల ఓట్లను ఆయన కోరుతున్నారు కదా! అక్కడ కూడా కుదిరితే గెలుపు గుర్రం ఎక్కుతారు కదా! మరి అక్కడి ప్రజల ఓట్లు కావాల్సిన ప్పుడు… అక్కడిప్రజల సమస్యలు కూడా […]
జగ్గారెడ్డికి పొగ పెడుతున్నారా?
టి.కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉండి.. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తోంది. మీరే ఇలా ప్రవర్తిస్తే .. ఇక సామాన్య కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ వెళుతుందని పేర్కొంటున్నారు. అసలు విషయమేంటంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల సీఎం దత్తత గ్రామమైన ఎరవల్లిలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వెళ్లేందుకు భారీ […]
కేటీఆర్ ఏం స్పెషలా అంటున్న రేవంత్
ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. అందులోనూ రాష్ట్ర మంత్రి.. రాష్ట్రంలో ఆయన చెప్పింది జరిగి తీరాల్సిందే.. అతనే కేటీఆర్..అయితే కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఇపుడు నేరుగా విమర్శణాస్ర్తాలు సంధిస్తున్నాడు. పవర్ ఉన్న వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు పట్టించుకోరా అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని నిలదీస్తున్నాడు. కేటీఆర్ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద […]
రవీందర్ కు అడ్డు వచ్చిన బండి..
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కినుకు వహించిన రవీందర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల్లో విజయం కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఈయన విజయానికి మాజీ టీఆర్ఎస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓటు […]
వారిని అదుపు చేయకపోతే కష్టమే..
కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తరువాత అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు సాగించలేదు. ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై .. ఇపుడు మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ఆమె ద్రుష్టి మొత్తం నిజామాబాద్ ఎంపీ స్థానంపైనే ఉంది. రెండున్నరేళ్లుగా జిల్లా పార్టీని పెద్దగా పట్టించుకోని కవిత ఇటీవల జిల్లాలో పర్యటిస్తున్నారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలు, నాయకులకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు ఆమెకు జిల్లాలోని […]