శాత‌క‌ర్ణికి బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఇదే

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌ ఆకాశాన్ని తాకుతోంది. ఈ జాబితాలో సీనియ‌ర్ హీరోలు వెన‌క‌బ‌డినా స్టార్ హీరోలు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు చాలా ముందున్నారు. టాలీవుడ్‌లో టాప్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరో ఎవ‌రంటే ఖ‌చ్చితంగా ఈ పోటీలో నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు కోసం ప‌వ‌న్‌, మ‌హేష్‌నే పోటీప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.

 ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్‌తో పాటు సినిమా బిజినెస్‌లో ప‌ర్సంటేజ్ కూడా తీసుకోవ‌డంతో వీరికి భారీగానే రెమ్యున‌రేష‌న్ ముడుతోంది. శ్రీమంతుడు, బ్ర‌హ్మోత్స‌వం సినిమాల్లో మ‌హేష్ స‌హ నిర్మాత‌గా కూడా ఉన్నారు. ఇందుకోసం మ‌హేష్‌కు రెమ్యున‌రేష‌న్‌తో పాటు బిజినెస్‌లో సైతం వాటా ద‌క్కింది. శ్రీమంతుడుకు లాభాల్లో కూడా భారీగా వాటా రావ‌డంతో రూ.20 కోట్ల వ‌ర‌కు ముట్టిన‌ట్టు స‌మాచారం.

 ఇక బ్ర‌హ్మోత్స‌వం ప్లాప్ అయినా మ‌హేష్‌కు రూ.20 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌, బిజినెస్‌లో వాటా కింద ద‌క్కింద‌ట‌. ఇక స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా నిర్మాణంలో సైతం ప‌వ‌న్ భాగ‌స్వామి కావ‌డంతో ప‌వ‌న్‌కు మొత్తం రూ.30 కోట్ల వ‌ర‌కు ద‌క్కింద‌ని టాక్‌. ఇక వ‌రుస హిట్ల‌తో ఉన్న ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ సైతం రూ.17 వ‌ర‌కు ఉంద‌ట‌. రెమ్యున‌రేష‌న్‌లో యంగ్ హీరోలు ఇలా దూసుకుపోతుంటే సీనియ‌ర్ హీరోలు వీరి స్థాయిలో కాక‌పోయినా వాళ్లు కూడా త‌మ రెమ్యురేష‌న్లు పెంచేసిన‌ట్టు తెలుస్తోంది.

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా కోసం బాల‌య్య రూ.7 కోట్లు తీసుకుంటున్నాడు. ఇది బాల‌య్య కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ అని టాక్‌. ఇక బాల‌య్య కో స్టార్ల‌లో వెంకీ, నాగార్జున రెమ్యున‌రేష‌న్ రూ 6-7 కోట్ల మధ్య‌లో ఉంటోంద‌ట‌. ఇక చిరు 150వ సినిమాను చిరు త‌న‌యుడు చెర్రీ నిర్మిస్తుండ‌డంతో ఆ రెమ్యున‌రేష‌న్ వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.