అవసరాల అదరగొట్టేశాడోచ్‌.

తెలుగు సినీ పరిశ్రమకి ఒకప్పుడు ‘సెకెండ్‌ సినిమా సెంటిమెంట్‌’ ఉండేది. తొలి సినిమాతో హిట్‌ కొడితే, రెండో సినిమాతో డిజాస్టర్‌ని చవిచూసేవారు దర్శకులు. కానీ ఇప్పుడా ట్రెండ్‌ దాదాపుగా మాయమైపోయింది. దర్శకులు చాలా ప్లానింగ్‌తో వెళుతున్నారు. యువతరం ఆలోచనలు మారాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తొలి సినిమాకన్నా రెండో సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కొరటాల శివ ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టి సత్తా చాటాడు. తాజాగా యంగ్‌ డైరెక్టర్‌, కమెడియన్‌ అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడిగా రెండు వరుస హిట్స్‌ని సొంతం చేసుకున్నాడు.

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తానో పెక్యూలియర్‌ డైరెక్టర్‌ననిపించుకున్న అవసరాల, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అనే ఫీల్‌ గుడ్‌ మూవీని తెరకెక్కించి, తన ప్రత్యేకతను మరోమారు చాటుకోవడం అభినందనీయం. కమర్షియల్‌ హంగుల కోసం అనవసరమైన హంగామా నడుస్తున్న ఈ రోజుల్లో ఫీల్‌ గుడ్‌ మూవీస్‌ చాలా అరుదుగా వస్తున్నాయి. అలాంటి ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్స్‌ని రూపొందించడంలో అవసరాలది ప్రత్యేకమైన శైలి. నారా రోహిత్‌, నాగశౌన్య, రెజినా కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలే కాక, ప్రేక్షకుల మన్ననలూ అందుతున్నాయి. కంగ్రాట్స్‌ అండ్‌ ఆల్‌ ది బెస్ట్‌ టు శ్రీనివాస్‌ అవసరాల.