ఈ తిక్కకి లెక్కే లేదు!

తిక్క మూవీకి… లెక్క ఎంత వచ్చిందనే విషయంలో జనాలకు ఎన్నో సందేహాలు.ఒకరు ఒకటంటారు.ఇంకొకరు ఇంకోటంటారు.మరి ఫైనల్ గా ఎంతనేది క్లారిటీతో తెలుసుకుంటే ఓ పనై పోతుందనుకుంట. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క అంటూ గత శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ చేస్తారు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉంటే ఓ రోజు ముందే థియేటర్లలోకి వచ్చేస్తుంటారు. కానీ ఇతడు తిక్క హీరో కదా… అందుకే ఓ రోజు లేట్ గా ఆడియన్స్ ను పలకరించాడు. అయితే.. సోమవారం కూడా హాలిడే కావడంతో.. సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాడనే టాక్ బాగానే వినిపించింది.

కానీ అదేంటో తిక్క లెక్క సరిగ్గా సెట్ కాలేదు. మొదటి రెండు రోజుల్లో ఏపీ-తెలంగాణల్లో కేవలం 3.17 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. నైజాం 1.05 కోట్లు.. సీడెడ్ 0.58 కోట్లు.. ఉత్తరాంధ్ర 35 లక్షలు.. గుంటూరు 27 లక్షలు.. ఈస్ట్ 30 లక్షలు.. కృష్ణా 24.5 లక్షలు.. వెస్ట్ 20 లక్షలు.. నెల్లూరు 16 లక్షలు షేర్ వసూలు కాగా.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 3.17 కోట్లు మత్రమే వచ్చింది. అది కూడా రెండు రోజుల్లో వచ్చిన మొత్తం. ఓవర్సీస్ లో అయితే తిక్క పరిస్థితి మరీ దారుణంగా ఉండడం మాత్రమే కాకుండా..కనీసం ఖర్చులు కూడా రాబట్టలేని సిట్యుయేషన్. ముఖ్యంగా సినిమాలో చూపించిన పార్టీలు.. కాస్ట్లీ బ్రాండ్ లిక్కర్ సీసాలు.. కార్ ఛేజింగ్లు.. జెట్ స్పీడ్ లో లవ్ ట్రాక్ . ఇవన్నీ మాస్ జనాలకు అంతగా ఎక్కలేదు. మొత్తానికి అయితే.. తిక్కతో తేజు…. ఓ ఫ్లాప్ టేస్ట్ చూసేటట్లుగానే ఉన్నాడు.