క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్‌ సినిమా

అఖిల్‌ రెండో సినిమాపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్‌, జూనియర్‌ డైరెక్టర్స్‌ను పరిశీలనలో పెట్టాడు అఖిల్‌. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్‌ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో ఒక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్‌ వినిపించింది.

కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్‌ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. క్రికెట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ స్టోరీ ఉండబోతోందట. మన వాళ్లకి క్రికెట్‌ పట్ల ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ అఖిల్‌ కూడా మంచి క్రికెటర్‌. సో ఈ స్టోరీ అయితే తనకి యాప్ట్‌ అవుతుందని భావిస్తున్నాడట. దాదాపుగా ఫైనల్‌ అయినట్లే ఈ స్టోరీ అని తెలుస్తోంది. ఒక యంగ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాని తెరకెక్కించే అవకాశాలున్నాయి.

మొత్తానికి తన రెండో సినిమా కోసం అఖిల్‌ చాలా కథలు వింటూ వింటూ, చివరికి తనకిష్టమైన క్రికెట్‌ స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్‌ పెద్దగా కష్టపడకుండా, తనకు బాగా అలవాటైన, అంతేకాదు ఎంతో ఇష్టమైన పాత్రనే నటించే అవకాశం ఉంది. ఈ పాత్రలో అఖిల్‌ నటిస్తాడు అనేకన్నా జీవిస్తాడనడంలో అతిశయోక్తి కాదనిపిస్తోంది.