రాహుల్ మెలిక‌తో బాబు షాక్‌

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో ఇప్ప‌టికే కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్ర‌బాబుకు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇవ్వ‌బోతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మీదే టీడీపీ అధినేత ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు స‌రిగ్గా వీటిని చెద‌ర‌గొట్టే మాస్ట‌ర్ ప్లాన్‌తో రాహుల్ సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అంతోఇంతో మ‌ళ్లీ బ‌ల‌ప‌డాల‌ని కాంగ్రెస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స‌రికొత్త మెలిక పెట్టింది. దీంతో చంద్ర‌బాబు […]

వైసీపీ + కాంగ్రెస్ పొత్తు

ఈ హెడ్డింగ్ చూడ‌డానికి కాస్త విచిత్రంగానే ఉండొచ్చు. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ కాంగ్రెస్‌తోనే విబేధించి వైసీపీ పెట్టాడు..మ‌రి అలాంటి జ‌గ‌న్ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడ‌న్న‌ది పెద్ద క్వ‌శ్చ‌నే. అయితే అప్పుడు జ‌గ‌న్ సీఎం పోస్టు కోస‌మో లేదా మ‌రో అవ‌స‌రం కోస‌మో కాంగ్రెస్‌తో విబేధించి వైసీపీ పెట్టి ఉండొచ్చు….అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ ప‌రిస్థితి ఏపీ వ‌ర‌కు (ఆ మాట‌కు వ‌స్తే దేశంలోను ఏమంత గొప్ప‌గా లేదు) స‌మాధికి చేరువుగా ఉంది. శ‌తాబ్దం చ‌రిత్ర […]

కాంగ్రెస్ స‌భ‌కి.. ప‌వ‌న్‌, జ‌గనా..!

గుంటూరు వేదిక‌గా ఆదివారం కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్న హోదా కోసం స‌భకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా క‌న్నా ఎక్కువ‌గానే ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా హాజ‌రవుతున్నారు. దాదాపు 2019 ఎన్నిక‌ల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్ర‌జ‌ల ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని కాంగ్రెస్ స్ఠానిక నేత‌లు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాల‌ని […]

యూపీలో బీజేపీ విజ‌యం – జ‌గ‌న్‌కు కొత్త టెన్ష‌న్‌

ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఎస్పీ ఓట‌మి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించేలా చేస్తోంది! ప్ర‌ధాని మోడీ విజ‌యం ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మి ప‌రాభవం జ‌గ‌న్‌కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఇలా అయితే ఏపీలో త‌న ప‌రిస్థితి ఏంటా అనే గుబులు మొద‌లైంద‌ట‌. అక్క‌డి ఫ‌లితాల‌కీ.. జ‌గ‌న్‌కీ ఉన్న లింక్ ఏంట‌నేగా మీ సందేహం? ఆ లింక్ పేరే ప్ర‌శాంత్ కిషోర్‌!! బిహార్ ఎన్నిక‌ల్లో నితీష్‌కుమార్‌కు వ్యూహ‌క‌ర్త‌గా నిలిచిన ప్ర‌శాంత్‌ను.. ఏరికోరి జ‌గ‌న్ […]

రాహుల్‌కి చెక్ పెడుతున్న దీదీ!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏ అవ‌కాశం వ‌చ్చినా.. అందిపుచ్చుకోవాలి. ఆ అవ‌కాశాన్ని త‌మ ఎదుగుద‌ల‌కు సోపానంగా మ‌లుచుకోవాలి. అప్పుడే జ‌నాల్లో ఆ పార్టీ ప‌ట్లా.. నేత‌ల ప‌ట్లా ఆద‌ర‌ణ పెరిగేది. అధికార ప‌క్షం చేసే త‌ప్పుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేదే అస‌లు సిస‌లైన విప‌క్షం. ఈ విష‌యంలో ఎందుకోగానీ ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి. అదేస‌మ‌యంలో ఈ పార్టీని వెన‌క్కి నెడుతూ.. అంద‌రూ దీదీగా పిలుచుకునే ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ని వెన‌క్కి […]

రాహుల్ డెసిష‌న్ టీ కాంగ్రెస్‌ను ముంచుతుందా

గ‌త ఎన్నిక‌ల‌ముందు .. తెలంగాణ‌పై గట్టి ఆశ‌లే పెట్టుకున్న‌కాంగ్రెస్ పార్టీని ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏస్థాయిలో ఖంగుతినిపించాయో ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. ఆ పార్టీ అధిష్ఠానమైతే ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేద‌నే చెప్పాలి.  ప‌దేళ్ల‌పాటు తెలంగాణ అంశాన్ని సాగ‌దీసి, చివ‌ర‌కు వ్యూహాత్మ‌కంగా  గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఒడిసిప‌డ‌దామ‌ని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఫ‌లితాలు చూశాక గ‌ట్టి గుణ‌పాఠ‌మే నేర్చుకుంద‌ని చెప్పాలి. ఆ గుణ‌పాట‌మేమంటే.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. ఆ పార్టీ స్థానిక […]

వావ్‌, మోడీని పొగిడేసిన రాహుల్‌ 

ప్రధానమంత్రిగా రెండేళ్ళ పదవీ కాలంలో నరేంద్రమోడీ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌కి సైన్యాన్ని ముందుకు నడిపించడమేనట. మామూలుగా అయితే రాజకీయాల్లో ఉన్నాక, అధికారంలో ఉన్నవారు ఏ మంచి పని చేసినా, దాన్ని విపక్షాలు హర్షించవు. అయితే ఇది దేశ భద్రతతో కూడుకున్న విషయం. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాంతో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి వీల్లేదు.  ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ని సమర్థిస్తున్నాం అని చెప్పి ఊరుకుంటాయి ఇష్టం లేకపోయినాసరే […]

యువరాజా, ఏంటి ఈ మాట తేడా!

యువరాజా రాహుల్‌గాంధీ మాట మార్చారు. మహాత్మాగాంధీని ఆర్‌ఎస్‌ఎస్‌ అంతమొందించిందని ఇదివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌గాంధీ, ఇప్పుడు మాట మార్చి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న ఓ వ్యక్తికి మహాత్మాగాంధీ హత్య కుట్రలో సంబంధం ఉందని మాత్రమే అన్నట్లు చెప్పారాయన. మహాత్మాగాంధీ హత్య కుట్రలో తమను ఇరికించేందుకు రాహుల్‌ ప్రయత్నించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ న్యాయస్థానంలో ప్రశ్నించింది. న్యాయస్థానం ఈ కేసులో ఇప్పటికే రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేయగా, రాహుల్‌ తరఫు న్యాయవాది, తమ క్లయింటు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వాదించారు. […]

యువనేతకి సుప్రీం షాక్‌

పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అనే విమర్శలను ఎదుర్కొంటున్న కాంగ్రెసు యువ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టైమ్‌ పాస్‌ కోసం చేసే విమర్శలు ఆయన్ని వివాదంలోకి లాగేస్తుంటాయి. తద్వారా ఆయన ఆ వివాదాల నుంచి బయటపడేందుకు నానా ఇబ్బందులూ పడాల్సి వస్తుంది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని ఓ సందర్భంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు, క్షమాపణ చెప్తారా? కేసు విచారణను ఎదుర్కొంటారా? […]