అరె సార్.. జర మాట్లాడరాదె..

వరి కొనుగోలు సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ అయిన సీఎం కేసీఆర్.. గంటలకొద్దీ వరుస ప్రెస్ మీట్లు.. ఇక్కడ బండి సంజయ్ మొదలు ఢిల్లీలో మోదీ మీద వరకు విమర్శలు.. కేంద్రం ఏం చేస్తలేదు.. బండి సంజయ్ నాటకాలాడుతున్నాడు.. అంటూ డైలాగుల మీద డైలాగులు.. మీరు కొంటరా..కొనరా చెప్పాలని డిమాండ్.. ఇక ఇందిరా పార్కులో ధర్నా.. కేంద్రం చెప్పి తీరాలె.. లేకపోతే ఢిల్లీ బోతం.. మెడలు వంచుతాం అంటూ ఆవేశపూరిత ప్రసంగం.. చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్లడం.. అక్కడ […]

కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..

వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం) […]

సారు.. వచ్చేశారు సిటీకి

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో సిటీలో ల్యాండ్ అయ్యారు. వరి సమస్యపై మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రజలకు చెప్పి తన టీమ్ తో హస్తినకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఎవరి దర్శనమూ కాలేదు. ఎంత ప్రయత్నించినా మోదీని కలిసే అవకాశం రాలేదు. దీంతో అక్కడే ఉండి చేసేది లేక తిరిగొచ్చేశారు. విచిత్రమేమంటే నాలుగు రోజుల పాటు ఒక […]

మూడు రోజులైంది.. ఇంకా ఎవ్వరినీ కలవలే..

‘‘మోదీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది.. రైతులను పట్టించుకోవడం లేదు.. అరె.. వరి కొంటారో, కొనరా చెప్పండయ్యా అంటే సమాధానం లేదు.. ఈ లొల్లేంది.. ఢిల్లీకి పోతాం.. అక్కడే తేల్చుకుంటాం’’ అని ధర్నా చౌకలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి. శభాష్.. సారు రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. అన్నదాతకు మేలు జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సారు చెప్పినట్లుగానే తన టీమ్ తో ఆదివారం ఢిల్లీకి బయలుదేరాడు. అంతే.. పోయి ఇంట్లో కూసున్నడు. ఇప్పటికి […]

మోదీపై సమర శంఖం పూరించిన కేసీఆర్‌

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది.. అదే రైతు ఉద్యమం.. దీనికి కేసీఆరే నేతృత్వం వహిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్‌ తెలంగాణ కోసం ఏళ్ల తరబడి కొట్లాడాడు.. నిరసన చేశాడు.. ధర్నాలు, దీక్షలు.. ఆమరణ నిరాహార దీక్ష..ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఇన్ని నిరసన కార్యక్రమాలుచేసి.. అనేకమంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా క్రెడిట్‌ మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో […]

ఈటల వింత వాదన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.. అక్కడ ఈటల రాజేందర్‌.. టీఆర్ఎస్‌ అభ్యర్థిపై గెలిచారు. అంతే.. ఈ చర్చ ఇపుడు ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులు ఈ విషయాల గురించి మాట్లాడతారు. అంతే.. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాత్రం వింత విషయాన్ని తెరపైకి తెచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవడం.. అందులోనూ తాను […]

దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]